MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • బట్టలు ఎంత తగ్గిస్తే.. అన్ని లైక్స్, డబ్బులు, ఆఫర్లు.. మాధవీలత షాకింగ్ కామెంట్స్..

బట్టలు ఎంత తగ్గిస్తే.. అన్ని లైక్స్, డబ్బులు, ఆఫర్లు.. మాధవీలత షాకింగ్ కామెంట్స్..

Madhavi Latha: నటి మాధవీలత మహిళల వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజం స్కిన్ షోను ఎలా ప్రోత్సహిస్తుందో ఆమె వివరించింది. అందంగా, స్టైలిష్‌గా డ్రెస్సులు ధరించాలని.. అయితే అసభ్యకరంగా ఉండకూడదని సూచించింది.  

2 Min read
Author : Pavithra D
Published : Jan 16 2026, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కీలక వ్యాఖ్యలు..
Image Credit : Madhavi Latha\Instagram

కీలక వ్యాఖ్యలు..

నటి మాధవీలత మహిళల వస్త్రధారణ, సామాజిక పోకడలు, తన సినీ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అనే విషయాలపై మగవారు, ముఖ్యంగా సినీ హీరోలు కామెంట్స్ చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆడవాళ్ల శరీర అవయవాలను సరుకు సామాన్లతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టైలిష్‌గా, అందంగా దుస్తులు ధరించవచ్చు..
Image Credit : Madhavi Latha\Instagram

స్టైలిష్‌గా, అందంగా దుస్తులు ధరించవచ్చు..

మహిళలు స్టైలిష్‌గా, అందంగా దుస్తులు ధరించవచ్చు. స్లీవ్‌లెస్, టోర్న్ జీన్స్ లాంటివి వేసుకోవచ్చని, కానీ అవి అసభ్యకరంగా ఉండకూడదని ఆమె స్పష్టం చేసింది. దుస్తులు తమ వ్యక్తిత్వానికి సరిపోవాలని, అందాన్ని పెంచేవిగా ఉండాలని, అసహ్యంగా కనిపించకూడదని మాధవీలత అభిప్రాయపడింది.

Related Articles

Related image1
ఎన్టీఆర్‌ను ఎదిరించే దమ్మున్న వ్యక్తి ఆయనే.. నిజాన్ని బయటపెట్టిన బాలకృష్ణ..
Related image2
ప్రభాస్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూశారా? 7 స్టార్స్ ను గుర్తుపట్టడం కష్టమే.?
35
సమాజం స్కిన్ షో ప్రోత్సహిస్తోంది.?
Image Credit : Madhavi Latha\Instagram

సమాజం స్కిన్ షో ప్రోత్సహిస్తోంది.?

సమాజం "స్కిన్ షో"ను ఎలా ప్రోత్సహిస్తుందో కూడా మాధవీలత తెలిపింది. కొంతమంది మహిళలు స్కిన్ షో చేస్తూ, సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం ద్వారా వెబ్ సిరీస్‌లు, టీవీ, సినిమా ఆఫర్లను పొందుతున్నారని ఆమె పేర్కొంది. దీనికి సమాజంలోని ప్రజలు కూడా సహకరిస్తున్నారని, రిపోర్ట్ చేయకుండా లేదా బ్లాక్ చేయకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించింది.

45
అమ్మాయిని మాత్రమే నిందించలేం..
Image Credit : Madhavi Latha\Instagram

అమ్మాయిని మాత్రమే నిందించలేం..

ఒక అమ్మాయిని మాత్రమే నిందించడం సరికాదని, ఈ పోకడకు సమాజం కూడా బాధ్యత వహించాలని నొక్కి చెప్పింది. కొందరు మొదట చీరలు కట్టుకొని, ఆ తర్వాత గ్లామర్ చూపించి ఫాలోవర్లు, కొలాబరేషన్లు, షాప్ ఓపెనింగ్ అవకాశాలు పొందుతున్నారని, పొట్టకూటి కోసం కొందరు ఇలా చేస్తుంటారని ఆమె తెలిపింది.

55
రాజకీయ ప్రస్థానం ఇలా..
Image Credit : Madhavi Latha\Instagram

రాజకీయ ప్రస్థానం ఇలా..

తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. తాను 2018లో బీజేపీలో చేరానని, 2019లో ఎన్నికలలో పోటీ చేశానని తెలిపింది. పార్టీ కార్యక్రమాలకు భౌతికంగా దూరమైనా, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటానని చెప్పింది. హిందుత్వం తన పుట్టుకతో వచ్చిందని, పార్టీ వేరు, హిందుత్వం వేరని స్పష్టం చేసింది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. 2008లో అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత సరైన ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో విఫలమయ్యానని అంగీకరించింది. తాను ఇండస్ట్రీని నిందించనని, తన ఎంపికలోనే లోపమని తెలిపింది. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తే, వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీస్, లేదా సినిమాలలో మళ్లీ నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాధవీలత స్పష్టం చేసింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
ప్రసిద్ధ వ్యక్తులు
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్‌ను ఎదిరించే దమ్మున్న వ్యక్తి ఆయనే.. నిజాన్ని బయటపెట్టిన బాలకృష్ణ..
Recommended image2
ప్రభాస్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూశారా? 7 స్టార్స్ ను గుర్తుపట్టడం కష్టమే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved