MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత దారుణమైన విషయాలు భరించింది.. ధనుష్, ఐశ్వర్య విడాకులపై నటి సంచలన వ్యాఖ్యలు

సమంత దారుణమైన విషయాలు భరించింది.. ధనుష్, ఐశ్వర్య విడాకులపై నటి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల సెలెబ్రిటీల బ్రేకప్ వ్యవహారాలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వివాహం చేసుకుని ఏళ్ల తరబడి కలసి జీవించిన వారు కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 20 2022, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇటీవల సెలెబ్రిటీల బ్రేకప్ వ్యవహారాలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వివాహం చేసుకుని ఏళ్ల తరబడి కలసి జీవించిన వారు కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. కొన్నిరోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, ధనుష్ తాము విడిపోతున్నట్లు ప్రకటించి చిత్ర పరిశ్రమని, అభిమానులని ఊహించని షాక్ లో ముంచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వీళ్లిద్దరి బ్రేకప్ సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. అటు రజని అభిమానులు, ధనుష్ అభిమానులు ఈ వార్తని జీర్ణించుకోలేకున్నారు. 2004లో ధనుష్, ఐశ్వర్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 18 ఏళ్ల పాటు కలసి జీవించిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుని విడిపోయారు. దీనితో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే చర్చ జరుగుతోంది. చాలా మంది అభిమానులు ధనుష్, ఐశ్వర్య వెంటనే విడాకులు రద్దు చేసుకుని కలిసిపోవాలని కోరుతున్నారు. 

37

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ప్రముఖ నటి లక్ష్మి రామకృష్ణన్ ని కోరుతూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సదరు నెటిజన్ భావోద్వేగానికి గురవుతూ 'అమ్మా లక్ష్మి రామకృష్ణన్.. ధనుష్, ఐశ్వర్య లని ఎలాగైనా మీరే కలపాలి' అని కోరాడు.  దీనికి లక్ష్మి రామకృష్ణన్ స్పందిస్తూ.. వారిద్దరూ పరస్పర గౌరవ భావంతో విడిపోయారు. ఒకరినొకరు నిందించుకోకుండా చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. దయచేసి వారికి ప్రైవసీ కల్పించాలని నటి కోరింది. 

47

దీనితో సదరు నెటిజన్ మరోసారి స్పందిస్తూ.. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ వారిద్దరూ సైలెంట్ గా విడిపోయిఉంటే బావుండేది. ఇలా ప్రచారం చేసుకోకూడదు. ఒకప్పుడు విడాకుల అంటే మామూలు విషయం కాదు. కానీ సెలెబ్రిటీల వల్ల విడాకులు సాధారణ విషయంగా మారిపోయింది అని పేర్కొన్నాడు. 

57

అతడికి లక్ష్మి రామకృష్ణన్ మరోసారి సమాధానం ఇస్తూ.. అలా చేయకుంటే భవిష్యత్తులో వారి గురించి అనేక విషయాలు ప్రచారం చేస్తారు. సమంత, నాగ చైతన్యలనే తీసుకోండి.. వారు యూదా గౌరవప్రదంగా విడిపోయారు. అయినప్పటికీ సమంత అనేక దారుణమైన విషయాలు భరించాల్సి వచ్చింది అంటూ లక్ష్మి రామకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

67

సమంత, చైతు గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో విడిపోయారు. అనంతరం సమంతపై అనేక పుకార్లు షికార్లు చేసాయి. అయితే వారిని సామ్ ధీటుగా తిప్పికోట్టింది. ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య విడాకులకు సంబందించిన కారణాలుగా అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

77

అయితే ధనుష్, ఐశ్వర్య విడాకుల వ్యవహారంలోకి సమంతని లాగడంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సమంతని ఉదాహరణగా పేర్కొనడంతో లక్ష్మి రామకృష్ణన్ ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా
Recommended image3
Rashmika Home Tour: సొంత ఊరిలో రష్మిక మందన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు చూశారా? స్వర్గంలా ఉన్న కూర్గ్ హౌస్ కాస్ట్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved