- Home
- Entertainment
- Kriti Shetty Latest Pics : గ్రీన్ శారీలో అందాలను విందు చేస్తున్న కృతి శెట్టి.. చూపులతో మత్తెక్కిస్తోంది..
Kriti Shetty Latest Pics : గ్రీన్ శారీలో అందాలను విందు చేస్తున్న కృతి శెట్టి.. చూపులతో మత్తెక్కిస్తోంది..
టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడుతున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty).. తన గ్లామర్ తో నెటిజన్లను మైమరిపిస్తోంది. చీరకట్టుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోందీ బ్యూటీ.

వరుస చిత్రాలలో నటిస్తూ తన కేరీర్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.. యంంగ్ హీరోయిన్ కృతి శెట్టి. మెగా హీరో, పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన ఈ సుందరి తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో కృతి శెట్టి హాట్ టాపిక్ గా మారింది. తన గ్లామర్, నటనతో కేరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. అతి చిన్న వయస్సులోనే ఇంత స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న కృతి శెట్టి స్టార్ డమ్ ను ఎంజాయి చేస్తోంది.
ఉప్పెన హిట్ చిత్రంగా నిలవడంతో కృతికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అటు నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో బోల్డ్ సీన్లలోనూ నటించి మతిపోగొట్టింది. అలాగే సంక్రాతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ మూవీలోనూ అక్కినేని నాగచైతన్య (Naga Chaithanya) సరసన నటించి మెప్పించింది.
ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే క్వాలిటీ కృతి శెట్టి సొంతం కావడం, అందుకు తగ్గట్టుగా స్టార్ హీరోయిన్ కు కావాల్సిన మెటీరియల్ కూడా కృతికి దక్కడంతో టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. వరుస సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది.
మరోవైపు కృతి శెట్టి సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు అప్పుడప్పుడు ఫొటోషూట్లు నిర్వహిస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమించి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా శారీలో స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ఆ పిక్స్ ను తన అభిమానులతో ఇన్ స్టాలో పంచుకుందీ సుందరి.
ఈ ఫొటోల్లో కృతి గ్రీన్ కలర్, మ్యాచింగ్ బ్లౌజ్ లో ఆకర్షణీయంగా ఉంది. స్లీవ్ లెస్ బ్లాస్ లో తన గ్లామర్ చూపిస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోందీ సొట్టబుగ్గల సుందరి. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల చూపులను ఆకర్షిస్తోంది. మత్తెక్కించే అందంతో మైమరిపిస్తోంది. ఈ ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇలా ఇచ్చింది.
క్యాప్షన్ లో ‘సంతోషం అనేది ఒక చక్రం వంటింది.. ఒక్కసారి మొదలైతే వస్తూనే ఉంటోంది. అందుకు త్వరగా మీ ఆనందాన్ని మొదలు పెట్టండి’ అని సూచించింది. అంతే కాకుండా రీల్స్ కూడా చేస్తోంది కృతి.. ఇటీవల థళపతి విజయ్ ‘అరబిక్ కుత్తు’ సాంగ్ కు మాస్ స్టెప్పులేసి, ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ‘ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం’ లాంటి చిత్రాల్లో నటిస్తోంది.