- Home
- Entertainment
- ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎంజాయ్ మెంట్ లేదు, నా భర్త అలాంటివాడు..ఇన్నేళ్లకు బయటపెట్టింది, హేమ ఎమోషనల్
ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎంజాయ్ మెంట్ లేదు, నా భర్త అలాంటివాడు..ఇన్నేళ్లకు బయటపెట్టింది, హేమ ఎమోషనల్
నటి హేమ భర్త గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన ఎక్కువగా మీడియా ముందు కనిపించరు. వీరిది ప్రేమ వివాహం. తాజాగా ఇంటర్వ్యూలో తన భర్త గురించి హేమ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం

వివాదాల్లో నటి హేమ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన హేమకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇటీవల హేమ వరుస వివాదాల్లో చిక్కులుని వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంతో హేమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని మాదక ద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత హేమ బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, లైఫ్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు.
ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్ళు
తాను ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్ళు అవుతోందని హేమ పేర్కొంది. హేమ మాట్లాడుతూ.. 'మా అమ్మ వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆమెకి సినిమాలంటే బాగా ఇష్టం. నేను ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి బాగా ప్రోత్సాహం అందించింది. సినిమాల్లోకి అడుగుపెట్టాక అవకాశాలు బాగా వచ్చాయి. కెరీర్ లో నిలదొక్కుకున్నాను. దూరదర్శన్ లో పనిచేస్తున్నప్పుడు సయ్యద్ జాన్ అహ్మద్ తో పరిచయం ఏర్పడడం అది ప్రేమగా మారడం జరిగింది. ఆ విధంగా తాను ప్రేమ వివాహం చేసుకున్నాను' అని హేమ తెలిపారు.
ప్రేమ వివాహం చేసుకునా ఎంజాయ్ మెంట్ లేదు
హేమ తన భర్త గురించి చెబుతూ.. ' మాది ప్రేమ వివాహం అయినప్పటికీ లైఫ్ లో నాకు ఎంజాయ్ మెంట్ లేదు. మా ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. సరదాగా బయటకి, సినిమాకి, ఫంక్షన్స్ కి వెళదామన్నా ఆయన రాడు. ఉదయాన్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్ కి వెళ్లేదాన్ని. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాక వంటతోనే సరిపోయేది. ఆ విధంగా నా లైఫ్ లో ఎంజాయ్ మెంట్ లేకుండా పోయింది' అని హేమ అన్నారు.
అందుకే బిగ్ బాస్ కి వెళ్ళా
లాక్ డౌన్ సమయంలోనే నా వయసు 40 ఏళ్ళు దాటింది. దీనితో శరీరంలో హార్మోనుల మార్పు కనిపించింది. ఫలితంగా తెలియని కోపం, బాధ ఏర్పడ్డాయి. నన్ను టార్చర్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఎందుకనో మానసికంగా కుంగిపోయాను. డిప్రెషన్ లోకి వెళ్లాను. ఆ సమయంలో బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. నాకు కూడా ఒక మార్పులా ఉంటుందని బిగ్ బాస్ షోకి వెళ్ళాను. బిగ్ బాస్ షోలో ఎక్కువరోజులు ఉండలేకపోయాననే బాధ ఉంది. కానీ ఆ షో వల్ల ఫ్రెండ్స్ ఏర్పడ్డారు.
కష్టాలన్నీ 2024లోనే
నా జీవితం మొత్తంలో ఎన్ని కష్టాలు అనుభవించానో.. అవన్నీ 2024లోనే ఒక్కసారిగా ఎదురయ్యాయి. నా తప్పు లేకపోయినా కష్టాలు ఎదురయ్యాయి. ఆ నిందలు భరించలేక చనిపోవాలని అనుకున్నా అని హేమ తెలిపింది. నాగార్జున గారితో నాకు మంచి అనుబంధం ఉంది. మా అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్ కి నాగార్జున, అమల ఇద్దరూ హాజరయ్యారు. గంటన్నరసేపు ఉన్నారు అని హేమ తెలిపారు.