- Home
- Entertainment
- పూరి జగన్నాధ్ పతనం గురించి చాలా ఏళ్ళ క్రితమే ఓపెన్ గా చెప్పేసింది, వందల కోట్ల ఆస్తి ఉన్న ఆ నటి ఎవరు ?
పూరి జగన్నాధ్ పతనం గురించి చాలా ఏళ్ళ క్రితమే ఓపెన్ గా చెప్పేసింది, వందల కోట్ల ఆస్తి ఉన్న ఆ నటి ఎవరు ?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల పరాజయం తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సాహసించడం లేదు అనే వార్తలు వచ్చాయి.

Puri Jagannadh
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల పరాజయం తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సాహసించడం లేదు అనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా పూరి జగన్నాధ్ కి తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించాలని గతంలో స్టార్ హీరోలు ఎగబడేవారు. చివరికి మెగాస్టార్ చిరంజీవి కూడా తన తనయుడు రాంచరణ్ ని ఆయన దర్శకత్వంలోనే లాంచ్ చేశాడు. అంటే పూరి జగన్నాధ్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పూరి జగన్నాధ్ కి ప్రస్తుతం స్టార్ హీరోలు ముఖం చాటేస్తున్నారు అంటే దీనిని డౌన్ ఫాల్ గానే పరిగణించాలి.
పూరి జగన్నాధ్ కెరీర్ కి పతనం తప్పదని చాలా ఏళ్ళ క్రితమే ఓ నటి బహిరంగంగా హెచ్చరించింది. ఆమె పూరి జగన్నాధ్ కి మంచి శ్రేయోభిలాషి. ఆమె ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. నటి హేమ అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. పూరి జగన్నాధ్, తన భార్య లావణ్యతో ప్రేమలో ఉన్నప్పుడు దగ్గరుండి వివాహం జరిపించింది కూడా హేమనే కావడం విశేషం. పూరి జగన్నాధ్ ఇంకా డైరెక్టర్ కాక ముందు అతడికి చిల్లర ఖర్చుల కోసం హేమ డబ్బు సాయం కూడా చేసేవారట.
హేమకి వారసత్వంగా 300 కోట్ల ఆస్తులు ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఆ రూమర్స్ ని హేమ ఖండించారు. కానీ తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని హేమ తెలిపింది. చాలా ఏళ్ల క్రితం హేమ పూరి జగన్నాధ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ని ఛార్మి అనే మేఘం కమ్మేసి ఉంది. ఆ మేఘాలు తొలిగిపోకుంటే పూరి కెరీర్ ముందుకు సాగడం కష్టం అని కూడా చెప్పింది.
చాలా ఏళ్లుగా పూరి జగన్నాధ్ కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం తప్ప మరో హిట్ లేదు. చివరి రెండు చిత్రాలు దారుణంగా డిజాస్టర్ కావడంతో తెలుగు హీరోలు పూరికి డేట్లు ఇవ్వడం లేదనే రూమర్స్ మొదలయ్యాయి. దీనితో హేమ చాలా ఏళ్ళ క్రితం చెప్పిన మాటలు నిజం అయ్యాయి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పూరి జగన్నాధ్ తప్పనిసరిగా తదుపరి చిత్రంతో కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంది.