MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డబ్బు కోసం ఏమైనా చేస్తా అది తప్ప..బీఎండబ్ల్యూ కార్లు ఎలా వచ్చాయంటే, నటి హేమ ఓపెన్ కామెంట్స్

డబ్బు కోసం ఏమైనా చేస్తా అది తప్ప..బీఎండబ్ల్యూ కార్లు ఎలా వచ్చాయంటే, నటి హేమ ఓపెన్ కామెంట్స్

గతంలో హేమ డబ్బు విషయంలో చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. హేమ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉందనే రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో హేమ స్పందించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 16 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాతుకుపోయారు. బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరితో ఆమెకి మంచి పరిచయాలు ఉన్నాయి. అత్త, వదిన, తల్లి తరహా పాత్రలు.. కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో హేమ నటించడం చూస్తూనే ఉన్నాం. హేమ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలని కూడా మూటగట్టుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

రీసెంట్ గా హేమ రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా రక్త పరీక్షలో నిర్ధారణ అయింది. దీనితో బెంగుళూరు పోలీసులు హేమని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. రీసెంట్ గా హేమ బెయిల్ పై విడుదల అయింది. 

37

అయితే గతంలో హేమ డబ్బు విషయంలో చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. హేమ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉందనే రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో హేమ స్పందించింది. తన సంపాదనకు ఆధారం కేవలం సినిమా మాత్రమే కాదు అని హేమ తెలిపింది. ముందు నుంచి తమది ధనిక కుటుంబమే అని పేర్కొంది. మా అమ్మకి నాకు ఒంటి నిండా నగలు ఉన్నాయి. 

47

అలాగని కేవలం సినిమా మీదే ఆధార పడి ఉంటే ఇంత డబ్బు ఉండేది కాదు అని తెలిపింది. ఎంత డబ్బు ఉన్నా కోట్ల విలువ చేసే ఫ్లాట్ లు, బీఎండబ్ల్యూ కార్లు ఎలా సంపాదించారు అని యాంకర్ ప్రశ్నించారు. హేమ సమాధానం ఇస్తూ మా ఊర్లో నాకు ఆస్తులు ఉన్నాయి. నా భర్త సంపాదిస్తారు. అలాగే నేను కూడా చిట్టీలు లాంటి వ్యాపారాలు చేస్తాను. కాబట్టి నా లైఫ్ హ్యాపీ అని తెలిపింది. 

 

57

అంతా అనుకుంటున్నట్లు నా దగ్గర వందల కోట్లు అయితే లేవు అని తెలిపింది. ఎంత డబ్బు ఉన్నా నేను గంజి నీళ్లు తాగి బతకగలను. అడవిలో వదిలేసినా బతుకుతా. నాకు లగ్జరీ లైఫ్ మాత్రమే అవసరం లేదు అని తెలిపింది. పని విషయంలో నాకు చిన్న చూపు లేదు. 

67

డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పని అయినా చేస్తాను. అయితే తలవంచుకునే పని మాత్రం చేయను అని తెలిపింది. ఈ మాటలనే వైరల్ చేస్తూ.. హేమ రేవ్ పార్టీలో దొరికిన విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. తలదించుకునే పని మాత్రం జీవితంలో చేయను అని తెలిపింది. ఇప్పుడు రేవ్ పార్టీలో దొరికిపోయి పరువు పోగొట్టుకుందిగా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

77

హేమని పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా ఆమెని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెయిల్ పై విడుదలయింది కాబట్టి అసలు రేవ్ పార్టీలో ఏం జరిగింది ? తనని ఎందుకు అరెస్ట్ చేశారు.. ఈ సమస్య నుంచి తాను ఎలా బయటపడబోతోంది .. మా అసోసియేషన్ బ్యాన్ చేయడం లాంటి విషయాల గురించి హేమ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3 Cast Fees: దృశ్యం 3 స్టార్ల రెమ్యూనరేషన్, బడ్జెట్‌ వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే
Recommended image2
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image3
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved