- Home
- Entertainment
- Esha Rebba Pics : నటి ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్.. ఆ హీరో కూతుళ్లు వరుస కామెంట్లు.. ఏమంటున్నారంటే?
Esha Rebba Pics : నటి ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్.. ఆ హీరో కూతుళ్లు వరుస కామెంట్లు.. ఏమంటున్నారంటే?
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Esha Rebba) తన ఫ్యాన్స్ ను పలకరిచేందుకు తాజాగా ఇన్ స్టాలో కొన్ని పిక్స్ ను షేర్ చేసుకుంది. అయితే టాలీవుడ్ స్టార్ కూతుర్లు ఇద్దరు ఈషా పిక్స్ పై వరుస కామెంట్లు పెట్టారు. తమ మనసులోని మాటల్ని బయటపెట్టారు.

నటి ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ లో తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. ఇండస్ట్రీకి వచ్చి పదేండ్లపైనే అయినా ఇంకా ఈ బ్యూటీ మంచి హిట్ పడలేదనే చెప్పాలి. అయినా పట్టువిడవని విక్రమార్కుడిలా ముందుకు వెళ్తోంది.
వచ్చిన అవకావాలను దక్కించుకుంటూ తన మార్క్ చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్ లోనూనటిస్తోంది ఈషా రెబ్బా. ఇటీవల డైరెక్టర్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడవ’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
అయితే ఈ బ్యూటీ.. సోషల్ మీడియానూ మాములూ రచ్చ చేయలేదు. తన గ్లామర్ షోతో చేసే రచ్చ అంతాఇంతా కాదనే చెప్పాలి. ఈషాకు సోషల్ మీడియాలోనూ క్రేజ్ ఉంది. ఈ మేరకు తన అభిమానులను ఖుషీ చేసేందుకు ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈషా ఒక రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంగా పలు ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. బాడీకాన్ డ్రెస్ లో ఈషా రెబ్బా నెటిజన్లు ఆకట్టుకుంటోంది. తన గ్లామర్ కు కుర్రాళ్లు కూడా ఫిదా అవుతున్నారు. అయితే ఈషా పోస్ట్ చేసిన ఫొటోలపై నటుడు రాజశేఖర్ కూతుర్లు వరుస కామెంట్లు చేశారు.
ముందుగా రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ‘క్యాండిల్ నైట్ డిన్నర్.. టేక్ మీ అవుట్ ఫర్ డిన్నర్’ అంటూ రెండు కామెంట్లు చేసింది. ఆ తర్వాత శివాత్మిక వరుసగా కామెంట్లు చేసింది.
‘నైస్ డ్రెస్.. స్నేహితులు అవుదామా.. నా ప్రియతమా, నేను నిన్ను డిన్నర్ కు బయటికి తీసుకెళ్లానా?’ అంటూ చాలా కొంటెగా కామెంట్లు చేసింది. దీంతో నెటిజన్లు కూడా ఆశ్చర్య పోతున్నారు. పాపం ఇద్దరు అక్కా చెల్లెళ్ల కామెంట్ల ధాటికి ఈషా సైలెంట్ అయిపోయింది. ఇంతలా కామెంట్లు చేయడానికి అసలు కారణం ఏంటో రహస్యంగానే ఉంది.