శ్రీదేవి అంతటి అందగత్తె..తెలుగు హీరోతో ప్రేమలో పడి, స్టెరాయిడ్స్ తీసుకుని కెరీర్ పాడు చేసుకున్న నటి ?
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు చాలా మంది గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. మరింత అందంగా కనిపించడం కోసం నటీమణులు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్లు కూడా అందుకు అతీతం కాదు.
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు చాలా మంది గ్లామర్ కోసం సర్జరీలు చేయించుకోవడం చూస్తూనే ఉన్నాం. మరింత అందంగా కనిపించడం కోసం నటీమణులు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్లు కూడా అందుకు అతీతం కాదు. ఒకప్పుడు హీరోయిన్లు చిన్న వయసులోనే అందంగా కనిపించడం కోసం స్టెరాయిడ్లు, హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకునేవారట.
ఆ విధంగా స్టెరాయిడ్స్ తీసుకుని కెరీర్ పాడుచేసుకున్న సీనియర్ హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆమె పేరు దీప. ఆమె కేరళకి చెందిన నటి. అసలు పేరు ఉన్ని మేరీ. సినిమాల కోసం తన పేరుని దీపగా మార్చుకుంది. 70, 80 దశకాల్లో చాలా మంది తెలుగు హీరోలతో కలసి నటించింది. ఏఎన్నార్ తో కూడా నటించింది. మురళి మోహన్ తో కలసి ఖైదీ నెంబర్ 77, దశ తిరిగింది లాంటి చిత్రాల్లో నటించింది.
మురళి మోహన్, దీప ఇద్దరూ ప్రేమలో పడ్డారు అని అప్పట్లో పుకార్లు వచ్చాయి. దీప అందానికి మురళి మోహన్ ఫిదా అయ్యారట. తమ రిలేషన్ గురించి చాలా సందర్భాల్లో మురళి మోహన్ క్లారిటీ ఇచ్చారు. నేను, దీప ఎక్కువ చిత్రాల్లో నటించిన సంగతి నిజమే. కానీ ఆమెని నేను ప్రేమించలేదు. కానీ దీప శ్రీదేవి అంతటి అందగత్తె అనేది వాస్తవం. కెమెరామెన్లు ఏ యాంగిల్ లో చూపించినా ఆమె అందంగా కనిపించేది. కెమెరామెన్లు కూడా పాడు చేయలేని అందం దీపాది అంటూ మురళి మోహన్ ప్రశంసలు కురిపించారు.
చిన్న తనంలోనే హీరోయిన్ అయింది. మరింత అందం కోసం దీప తల్లిగారే ఆమెకి స్టెరాయిడ్స్ ఇచ్చారని చాలా మంది చెప్పుకున్నారు. ఆ విషయం నా దృష్టికి కూడా వచ్చింది అని మురళి మోహన్ తెలిపారు. స్టెరాయిడ్స్ కారణంగా ఆమె బాగా లావు అయ్యారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి.
దీపతో తాను ఎప్పుడూ ప్రేమలో పడలేదు అని మురళి మోహన్ తెలిపారు. ప్రేమ వ్యవహారాల జోలికి నేను వెళ్లదలుచుకోలేదు. నిబద్దతతో ఉండేవాడిని అని తెలిపారు. దీప అప్పట్లో చాలా బోల్డ్ హీరోయిన్. గ్లామర్ ప్రదర్శించడం మాత్రమే కాదు.. మలయాళీ చిత్రంలో అప్పట్లోనే లిప్ లాక్ సీన్ లో నటించింది.