- Home
- Entertainment
- గేమ్ ఛేంజర్ షూటింగ్ లో గాయపడ్డ అంజలి.. ఆ నొప్పి భరిస్తూనే, ఐటెం సాంగ్స్ గురించి ఓపెన్ కామెంట్స్
గేమ్ ఛేంజర్ షూటింగ్ లో గాయపడ్డ అంజలి.. ఆ నొప్పి భరిస్తూనే, ఐటెం సాంగ్స్ గురించి ఓపెన్ కామెంట్స్
జర్నీ చిత్రంతో అచ్చ తెలుగు నటి అంజలి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

జర్నీ చిత్రంతో అచ్చ తెలుగు నటి అంజలి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇప్పటికీ అంజలి మంచి మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం అంజలి గేమ్ ఛేంజర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తోంది.
అంజలి 2014లో నటించిన హర్రర్ కామెడీ డ్రామా గీతాంజలి చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది చిత్రం ఏప్రిల్ 11 న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర ప్రచారం కార్యక్రమంలో భాగంగా అంజలి, కోనా వెంకట్ ఇద్దరూ అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.
Anjali
దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయింది. అలీ, అంజలి మధ్య సంభాషణ సరదాగా సాగినట్లు ఉంది. అంజలి తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది. ఎవరో నిర్మాతని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని అలీ సరదాగా అడిగారు. దీనికి అంజలి బదులిస్తూ నిర్మాత కాదు అగ్ర నిర్మాత అని సెటైర్ వేసింది.
అంజలి వరుసగా ఐటెం సాంగ్స్ కూడా చేస్తోంది. సింగం 2, సరైనోడు, మాచర్ల నియోజకవర్గం లాంటి చిత్రాల్లో అంజలి స్పెషల్ సాంగ్స్ చేసింది. తనకు ఐటెం సాంగ్స్ విషయంలో తనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయని అంజలి తెలిపింది. అవన్నీ ఫుల్ ఫిల్ అయితేనే ఐటెం సాంగ్ చేస్తా.. లేకుంటే చేయను అని తేల్చి చెప్పేసింది.
ఇక రాంచరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో తాను గాయపడ్డట్లు అంజలి పేర్కొంది. ఆ చిత్రంలో రోప్ తో చేసే షాట్స్ చాలా ఉన్నాయి. దీనితో నా కండరాలకు గాయం అయ్యింది. ఆ గాయంతోనే బాధపడుతూ నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో రా రా రెడ్డి అనే ఐటెం సాంగ్ చేసినట్లు అంజలి పేర్కొంది.
రోప్ తో చేసే షాట్స్ ఉన్నాయంటే గేమ్ ఛేంజర్ చిత్రంలో అంజలి పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో అర్థం అవుతోంది. రాంచరణ్, అంజలి ఈ చిత్రంలో భార్య భర్తలుగా నటిస్తున్నారు.