- Home
- Entertainment
- ఫస్ట్ నైట్ రోజే భర్తకి యాక్సిడెంట్, పెర్ఫార్మన్స్ అదరగొట్టేసిన హీరోయిన్.. ఐబొమ్మలో థ్రిల్లర్ మూవీ
ఫస్ట్ నైట్ రోజే భర్తకి యాక్సిడెంట్, పెర్ఫార్మన్స్ అదరగొట్టేసిన హీరోయిన్.. ఐబొమ్మలో థ్రిల్లర్ మూవీ
Ibomma: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ప్రస్తుతం ఓటీటీలో బాగా రాణిస్తున్నాయి. థ్రిల్లర్ అంశాలు జోడించి కథని ఆసక్తికరంగా నడిపిస్తే అలాంటి చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. ఆ తరహా చిత్రమే శివంగి. ఈ చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటించింది.

Shivangi Movie
Shivangi Movie on Ibomma: హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ప్రస్తుతం ఓటీటీలో బాగా రాణిస్తున్నాయి. థ్రిల్లర్ అంశాలు జోడించి కథని ఆసక్తికరంగా నడిపిస్తే అలాంటి చిత్రాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. ఆ తరహా చిత్రమే శివంగి. ఈ చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటించింది. పాపులర్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ అధికారిగా నటించింది. నేటి నుంచి ఈ చిత్రం ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ మొదలైంది.
మార్చి 7న థియేటర్స్ లో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి అంతగా ఆదరణ లభించలేదు. కానీ ఓటీటీలో చూసేందుకు మాత్రం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అందుకు కారణం ఆనంది ఇచ్చిన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ మూవీ పైరసీ సైట్ ఐబొమ్మలో కూడా టాప్ లో ట్రెండ్ అవుతోంది.
Kayal Anandhi
ఆనంది వరంగల్ కి చెందిన అమ్మాయి. గతంలో ఆమె శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. శివంగి చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పడడంతో చెలరేగిపోయింది. డైలాగ్ చెప్పే విధానంలో కానీ, వార్నింగ్ ఇచ్చే సన్నివేశాల్లో కానీ చాలా కాన్ఫిడెంట్ గా నటించింది. కథ ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఆనంది ఈ మూవీలో సత్యభామ అనే అమ్మాయిగా నటించింది.
పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అవుతున్న టైంలో ఆమె భర్త యాక్సిడెంట్ కి గురవుతాడు. తీవ్రమైన గాయాలతో మంచాన పడతాడు. భర్త కోలుకోవాలి అంటే ఆపరేషన్ చేయించాలి. ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. మరోవైపు అత్తగారు వేధిస్తుంటారు. తన తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుంటారు. ఇదంతా ఒకెత్తయితే తనని ఆఫీస్ లో బాస్ లైంగికంగా వేధించాలని ప్రయత్నిస్తుంటాడు.
Shivangi
ఈ క్రమంలో ఊహించని పరిస్థితిలో ఆమె పోలీసులని ఆశ్రయించాల్సి వస్తుంది. అక్కడ పోలీస్ అధికారిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఉంటారు. సత్యభామ తన కష్టాల నుంచి బయటపడిందా ? అసలు పోలీసుల వద్దకి ఎందుకు వెళ్ళింది ? ఈ అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి.