రీసెంట్ గా ప్రమాదాలకు గురైన స్టార్ యాక్టర్స్

First Published 18, Jun 2019, 11:10 AM IST

ఇటీవల కాలంలో యువ హీరోలు ఎక్కువగా గాయాలపాలయ్యారు. కొందరు షూటింగ్ లలో గాయపడితే మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డారు. కానీ ఈ పెను ప్రమాదాలలో చిన్నపాటి గాయాలతో తప్పించుకోవడం వారి అదృష్టమని చెప్పాలి.  

నాగ శౌర్య: షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా స్టంట్ చేసిన ఈ హీరో 15 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కిందకి జారుతుండగా గాయపడ్డాడు. కాలికి గాయమవ్వడంతో నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు.

జూనియర్ ఎన్టీఆర్: తారక్ కూడా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా చేయి బెణికింది.  చేతికి కట్టు ఉండడం వల్ల రెండు వారాలు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

రామ్ చరణ్: జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా పాదానికి గాయమయ్యింది. అందువల్ల RRR షూట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

సుధాకర్ -  మంగళగిరిలో అనుకోని విధంగా మలుపు దగ్గర యాక్సిడెంట్ కావడంతో సుధాకర్ కారు దెబ్బతింది. చిన్నపాటి గాయాలతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో  సుధాకర్, అతని గ్యాంగ్ ప్రమాదం నుంచి బయటపడింది.

నాని: గత ఏడాది జెర్సీ షూటింగ్ లో బాల్ తగిలి నాని ముక్కుకి గాయమైంది. ఇక ఇటీవల గ్యాంగ్ లీడర్ షూట్ లో కూడా కాలికి దెబ్బ తగలడంతో నాని రెస్ట్ తీసుకుంటున్నాడు.

శర్వానంద్; బ్యాంకాక్ లో 96 రీమేక్ షూటింగ్ లో శర్వా స్కై డైవింగ్ చేస్తూ గాయపడ్డాడు. భుజానికి, కాలికి గాయాలవడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చిక్కిత్స తీసుకుంటున్నాడు.

సందీప్ కిషన్: తెనాలి రామకృష్ణ షూటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ సీన్ షూట్ చేస్తుండగా ఈ యువ హీరోకి చిన్నపాటి గాయాలయ్యాయి.

వరుణ్ తేజ్- వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రయాణిస్తుండగా వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. కారు ధ్వంసమయినప్పటికీ వరుణ్ సురక్షితంగా బయటపడ్డాడు.

గోపీచంద్: షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లిన గోపీచంద్ అక్కడ అనుకోని విధంగా గాయపడ్డాడు. బైక్ ఛేజింగ్ సీన్ లో బైక్ స్కిడ్ అవ్వడంతో గోపికి గాయాలయ్యాయి. ఈ గాయాల వల్ల నెల పాటు గోపి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

జబర్దస్త్ కమెడియన్ చంటి - కోదాడ హైవేపై వెళ్తుండగా ఆగి ఉన్న లారీని చంటి కారు ఢీకొట్టింది. స్వల్ప గాయాలతో చంటి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

loader