Devara: దేవర షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను అలా చూసి షాకయ్యా.. నటుడి షాకింగ్ కామెంట్స్
Devara: జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సెట్స్ పై తన అనుభవాలను పంచుకున్నాడు నటుడు సుదేవ్ నాయర్. ఎన్టీఆర్ వన్ టేక్ ఆర్టిస్ట్ అని, యాక్షన్ సన్నివేశాలలో డూప్ లేకుండా అద్భుతంగా చేస్తారని అతడు కొనియాడాడు.

అగ్ర నటులపై కీలక కామెంట్స్
నటుడు సుదేవ్ నాయర్ తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, మమ్ముట్టి, పవన్ కళ్యాణ్, సైఫ్ అలీ ఖాన్ లాంటి సీనియర్ నటుల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పెద్ద స్టార్లతో నెగటివ్ క్యారెక్టర్లు పోషించడం చాలా కష్టమైన పని అని, మొదట్లో భయం వేసేదని అతడు తెలిపాడు. మమ్ముట్టితో చేసేటప్పుడు బాగా తడబడ్డానని.. ఆయన నన్ను కూల్ చేసి.. ఓన్లీ క్యారెక్టర్ గానే తనను ఊహించుకుని నటించు అనేసరికి సులువుగా పని చేయగలిగానని అతడు అన్నాడు.
అలా పెద్ద నటులతో పని చేశా
అలా నెమ్మదిగా పెద్ద నటులతో పని చేయడంలో అలవాటు పడ్డానని సుదేవ్ నాయర్ అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చాలా డౌన్ టు ఎర్త్ అని, ఆయనతో మాట్లాడటం చాలా సులభమని సుదేవ్ తెలిపాడు. దేవర చిత్ర షూటింగ్ సమయంలో, ఉదయం జిమ్‌లో ఎన్టీఆర్ తో కలిసి వర్కవుట్ చేసేవాడని, ఆ సమయంలో ఆయన చాలా క్యాజువల్‌గా, ఫ్రెండ్లీగా ఉండేవారని సుదేవ్ నాయర్ వెల్లడించాడు. తాను వర్కవుట్ చేస్తుండగా కూడా ఎన్టీఆర్ బై చెప్పి వెళ్లేవారని, ఇది గొప్ప నటుల నుంచి నేర్చుకోవాల్సిన విషయమని అతడు తెలిపాడు.
పవన్ తో ఎక్కువ సమయం గడపలేకపోయా
ఎన్టీఆర్ తన వ్యక్తిగత ట్రైనర్‌తో ఉదయం జిమ్ లో ట్రైనింగ్ చేసేవారు. సాధారణంగా తాను జిమ్‌కు వెళ్ళేసరికే ఎన్టీఆర్ అప్పటికే అక్కడ ఉండేవారని సుదేవ్ నాయర్ చెప్పాడు. సైఫ్ అలీ ఖాన్ కూడా అప్పుడప్పుడు జిమ్‌లో కలిసేవారని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సమయం గడపలేకపోయానని, ఆయన చాలా బిజీగా ఉండేవారని సుదేవ్ నాయర్ తెలిపారు. ఓజీ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ కూడా మొదటిగా తన సన్నివేశాల చిత్రీకరించి పూర్తి చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి వచ్చిందని.. ఆ సమయంలో పవన్ తో సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా రిజర్వ్‌డ్‌గా ఉంటారని సుదేవ్ నాయర్ పేర్కొన్నాడు.
ఎన్టీఆర్ వన్ టేక్ ఆర్టిస్ట్
దేవర సెట్స్‌లో ఎన్టీఆర్ ప్రొఫెషనలిజం గురించి సుదేవ్ నాయర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒక యాక్షన్ సీన్ రిహార్సల్ చేస్తున్నప్పుడు, ఎన్టీఆర్ వచ్చి చూసి, ఒక్క టేక్‌లోనే పూర్తి చేశారని అన్నాడు. ఒక క్లిష్టమైన ఫైట్ సీన్‌లో, తాను ఎన్టీఆర్ పైకి దూకి కత్తితో దాడి చేయాల్సి ఉండగా, మాస్టర్ తనను వెనుకకు దూకమని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ 'డోంట్ వర్రీ బ్రో.. నేను మేనేజ్ చేసుకుంటా' అని చెప్పారు. రిహార్సల్‌లో ఒకసారి పడిపోయినప్పటికీ, అసలు టేక్‌లో అద్భుతంగా చేశారని ఎన్టీఆర్‌ను సుదేవ్ నాయర్ ప్రశంసించారు. అడవిలో జరిగే ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ ఎటువంటి డూప్‌ను ఉపయోగించలేదని, ఒక్క టేక్‌లోనే చేశారని కొనియాడాడు.
ఎన్టీఆర్ సెట్‌లో చాలా ఫోకస్డ్
ఎన్టీఆర్ సెట్‌లో చాలా ఫోకస్డ్‌గా ఉంటారని, జిమ్‌లో మాత్రం రిలాక్స్‌డ్‌గా, క్యాజువల్‌గా ఉంటారని వివరించాడు. ఆయన చాలా ఫ్రెండ్లీ, సులువుగా కలవచ్చని సుదేవ్ నాయర్ అన్నాడు. సైఫ్ అలీ ఖాన్ సెట్‌లో సరదాగా ఉంటారని, జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తారని చెప్పాడు. మొత్తంగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్రిలియంట్ యాక్టర్, ఆయన డ్యాన్స్‌లో ఎవరూ సాటిరారని సుదేవ్ నాయర్ ప్రశంసలతోముంచెత్తాడు.