కోట శ్రీనివాస్ కు మురళీ మోహన్ సాయం.... లేదంటే ఆయన ఇండస్ట్రీలో ఉండేవారు కాదేమో!
సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలియజేశారు. కోట శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తలో చేసిన సాయాన్ని తెలియజేశారు.

సీనియర్ నటుడు మురళీ మోహన్ ఇటీవల వార్తల్లో బాగా కనిపిస్తున్నారు. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా మరిన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
రీసెంట్ గా అలీతో సరదాగా టాక్ షోకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ (Kota Srinivas) గురించి మాట్లాడారు.
కోట శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ఆడియెన్స్ ను అలరించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా వందల సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం వయస్సు మీద పడటం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం కోట శ్రీనివాస్ గురించి మురళీ మోహన్ ఆసక్తికరంగా మారాడు.
కోట శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తలో బ్యాంక్ లో ఉద్యోగం చేసేవాడని చెప్పారు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు సినిమాల్లో నటించేవారంట. కానీ అవకాశాలు ఎక్కువైన సమయంలో ఉద్యోగామా? సినిమాలా? అని తేల్చుకోలేకపోయారంట.
ఈ విషయంలో కోట శ్రీనివాస్ మురళీ మోహన్ సాయం కోరారంట. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అడిగారంట. దానికి మురళీ మోహన్ సినిమాలు చేయమని చెప్పారంట. కానీ వచ్చే రెమ్యునరేషన్ లో సగం దాచుకోవాలని, మిగిలిన దానిలోనే జీవనం సాగించాలని చెప్పారంట. అలా కోట ఇండస్ట్రీలో ఉండేందుకు ఒక రకంగా కారణమయ్యారు.