MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karate Kalyani: మరో పెళ్లి చేసుకోవాలని ఉంది, దాని కోసం తపించి పోతున్నాను... కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్!

Karate Kalyani: మరో పెళ్లి చేసుకోవాలని ఉంది, దాని కోసం తపించి పోతున్నాను... కరాటే కళ్యాణి సంచలన కామెంట్స్!

వివాదాలతో తరచుగా వార్తల్లో ఉంటుంది కరాటే కళ్యాణి. ఈ టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ తాజా ఇంటర్వ్యూలో వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందులు తెలియజేశారు. మాజీ భర్త నరకం చూపించాడంటూ వేదన చెందారు..  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 23 2022, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Karate Kalyani

Karate Kalyani


యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి(Karate Kalyani) మాట్లాడుతూ... నాలో అందరూ బోల్డ్ యాంగిల్ మాత్రమే చూస్తున్నారు. నేను సిల్వర్ స్క్రీన్ పై చేసిన పాత్రలతో జడ్జి చేస్తుంటారు. పైకి బాబీగా కనిపించే నాలో తెలియని కోణం మరొకటి ఉంది. సినిమాలు బ్రతుకు దెరువు కోసం చేస్తున్నాను. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


నిజ జీవితంలో నేను చాలా మందికి సహాయం చేశాను. నా వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు, కష్టాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత నరకం అనుభవించాను. మాజీ భర్త నన్ను టార్చర్ చేశాడు. అది ఎలాంటి టార్చర్ అంటే... ఒక రోజు బేగంపేట వద్ద నడిరోడ్డుపై నా బట్టలు లాగేశాడు. పబ్లిక్ ముందు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. 
 

36


ఇలాంటి అనేక దారుణ చర్యలకు అతడు పాల్పడ్డాడు. అందుకే విడాకులు తీసుకొని విడిపోయాను. ఇప్పటికీ మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. నిజమైన ప్రేమ కోసం నేను తపిస్తున్నాను. నన్నుగా ప్రేమించే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను, అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. 

46


కరాటే కళ్యాణి జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నడిరోడ్డుపై అతని బట్టలు చిరిగేలా కొట్టింది. పెద్ద న్యూసెన్స్ కావడంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఇద్దరిపై కేసులు పెట్టారు. కంప్లైంట్ ఇచ్చిన నాపై ఎలా కేసుపెడతారని కరాటే పోలీసులపై వాగ్వాదానికి దిగారు. 

56


కాగా కరాటే కళ్యాణి వద్ద ఒక పాప పెరుగుతుందని తెలిసి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఇంటిని సోదా చేశారు. ఈ దాడులు అనంతరం పాప పేరెంట్స్ తో పాటు ప్రెస్ మీట్ పెట్టి కరాటే కళ్యాణి వివరణ ఇచ్చారు. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ తరపున పోటీ చేసిన కరాటే కళ్యాణి ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేశారు. 
 

66

బిగ్ బాస్ తెలుగు 4 లో పాల్గొన్న కరాటే కళ్యాణి ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. రెండవ వారమే ఆమె ఎలిమినేట్ అయ్యారు. చిన్న చిన్న విషయాలకు గొడవపడటం, ఏడవడం చేసేది. ఆడియన్స్ కి చిరాకేసి త్వరగా ఇంటికి పంపేశారు. ఈ మధ్య ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా పెద్దగా రావడం లేదు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved