- Home
- Entertainment
- పవన్ పై జోగి నాయుడు తీవ్ర విమర్శలు, చేసేవన్నీ సినిమాటిక్ పనులే.. జగన్ కి కూడా వ్యాపారాలున్నాయి, కానీ
పవన్ పై జోగి నాయుడు తీవ్ర విమర్శలు, చేసేవన్నీ సినిమాటిక్ పనులే.. జగన్ కి కూడా వ్యాపారాలున్నాయి, కానీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత కాబట్టి ఆయనపై రాజకీయ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ప్రత్యర్థులు పవన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు పెంచుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత కాబట్టి ఆయనపై రాజకీయ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ప్రత్యర్థులు పవన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు పెంచుతున్నారు. పవన్ ప్రస్తుతం కొంత కాలం రాజకీయ కార్యక్రమాలు పక్కన పెట్టి తాను కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో నటుడు, వైసిపి మద్దతు దారుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్న జోగి నాయుడు తాజాగా పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పై జోగినాయుడు రీసెంట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసే పనులన్నీ సినిమాటిక్ గానే ఉంటున్నాయని జోగి నాయుడు అన్నారు.
చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీలో నేను కార్యకర్తగా పనిచేశాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ నాకు నచ్చలేదు. సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి. కానీ ఆచరించకుండా సినిమాటిక్ పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే గాలివాటంగా రాజకీయాలు చేస్తూ మళ్ళీ మాయం అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే ప్రొఫెషనల్.. రాజకీయాల్లో కాదు. రాజకీయాల్లో జగన్ గారు ప్రొఫెషనల్. జగన్ గారికి కూడా వ్యాపారాలు ఉన్నాయి. కానీ తన వ్యాపార బాధ్యతలని జగన్ గారు మరొకరికి అప్పగించి రాజకీయాలు చేస్తున్నారు. పూర్తిగా ప్రజల్లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాలుగేళ్ళ సమయం వృధా చేశారు. ఈ నాలుగేళ్లు పవన్ ప్రజల్లోనే ఉండిఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అని జోగినాయుడు అన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక స్టార్ గా ప్రజల్లో ఉంటున్నారు కానీ, నాయకుడిగా నమ్మకం కలిగించలేకున్నారు. అందుకే ప్రజలు ఆయనకి పట్టం కట్టడం లేదు. నెలకోసారి వచ్చి మీటింగ్ పెట్టి సినిమా తరహాలో ప్రసంగించి వెళ్ళిపోతే ఏం లాభం ఉండదు. రాజకీయాలన్నాక ఓపిగ్గా ప్రజల్లోనే ఉండాలి. చాలా సహనం కావాలి. పవన్ లో ఆ లక్షణం లేదు అంటూ జోగినాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చిత్ర పరిశ్రమ నుంచి పోసాని, అలీ తర్వాత వైసిపి ప్రభుత్వంలో పదవి పొందిన నటుల్లో జోగినాయుడు కూడా ఉన్నారు.
Pawan Kalyan
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పై ఇంతలా విరుచుకుపడ్డ జోగినాయుడు విమర్శలకు జనసేన పార్టీ సమాధానం ఇస్తుందేమో చూడాలి.