రాజమౌళి మూవీ వల్ల నా పిల్లలు కూడా దగ్గరకి రావడం లేదు..ఆరోజే చనిపోవాల్సింది, ఇంత నరకమా
రాజమౌళి సినిమా అంటే విలన్ పాత్ర హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇంతటి పవర్ ఫుల్ విలన్ ని హీరో ఎలా జయిస్తాడు అనే అనుమానాలు ఆడియన్స్ కి వచ్చేలా రాజమౌళి తన చిత్రాల్లో విలన్ పాత్రని డిజైన్ చేస్తారు.
రాజమౌళి సినిమా అంటే విలన్ పాత్ర హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇంతటి పవర్ ఫుల్ విలన్ ని హీరో ఎలా జయిస్తాడు అనే అనుమానాలు ఆడియన్స్ కి వచ్చేలా రాజమౌళి తన చిత్రాల్లో విలన్ పాత్రని డిజైన్ చేస్తారు. సై, సింహాద్రి, ఛత్రపతి, ఈగ, బాహుబలి ఇలా రాజమౌళి ఏ చిత్రం తీసుకున్నా భయంకరమైన విలన్లు ఉంటారు.
విక్రమార్కుడు చిత్రంలో విలన్ గా నటించిన తెలుగు నటుడు అజయ్ పోషించిన టిట్లా పాత్ర చిత్రానికే హైలైట్ అయి చెప్పొచ్చు. అజయ్ ని ఈ చిత్రంలో రాజమౌళి భారీ కటౌట్ తో చూపించారు. టిట్లా పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. అయితే అజయ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఇదే అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో విలన్ రోల్స్ లో అజయ్ ఈ చిత్రంతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
విక్రమార్కుడు చిత్రంతో అజయ్ కి చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అదే విధంగా నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయట. విక్రమార్కుడు చిత్రం తర్వాత తాను నటించిన ప్రతి చిత్రాన్ని ఆ మూవీతో పోల్చడం మొదలు పెట్టారట. విక్రమార్కుడులో నా గెటప్ చూసి నా పిల్లలు కూడా దగ్గరకి రావడానికి భయపడ్డారు. కొన్నిరోజులు వాళ్ళు నా దగ్గరకి రాలేదు. మనసుకి చాలా బాధగా అనిపించింది అని అజయ్ అన్నారు.
విక్రమార్కుడు క్లైమాక్స్ షూటింగ్ లో ఒక సంఘటన జరిగింది. ఫైట్ సన్నివేశంలో నన్ను రోప్ తో పైకి లాగుతారు. క్రేన్ సహాయంతో ఆ షూటింగ్ చేశారు. అసిస్టెంట్స్ కొందరు సరిగ్గా గమనించినట్లు లేదు. ఆ రోప్ టైట్ గా లేకపోవడం వల్ల క్రేన్ రాడ్ నా తలకి తగిలింది. రెప్పపాటు కాలంలో ఆగింది. అప్పటికి కొంచెం తగిలింది. ఆ సమయంలో నా తలకి డమ్మీ బ్లడ్ పెట్టి ఉన్నారు. అది బయటకి వచ్చేసింది.
నేనైతే చనిపోయాను అని అనుకున్నా. అది నిజమైన రక్తమో.. డమ్మీ రక్తమో నాకు అర్థం కావడం లేదు. నానా భార్య పిల్లలు అందరూ కళ్ళముందు కనిపిస్తున్నారు. రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఉన్నారు. ఆయనకి మాత్రమే ఏం జరుగుతుందో అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళకి సరిగ్గా కనిపించదు. క్రేన్ నా దగ్గరకి వచ్చి ఆగిన వెంటనే.. రాజమౌళి గారు చచ్చాడు అంటూ ఒక్కసారిగా నాదగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికీ క్రేన్ కి సంబందించిన ఒక రాడ్ నా కాళ్ళని పడింది.
రాజమౌళి గారు పరిగెత్తడం చూసి అందరూ వచ్చారు. రెప్పపాటు కాలంలో క్రేన్ ఆగకపోయి ఉంటే నా తల మిగిలిపోయేది అని అజయ్ తెలిపారు. అప్పటికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. రాజమౌళి గారు షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అన్నారు. పర్వాలేదు నేను చేస్తానని అంటూ షూటింగ్ పూర్తి చేసినట్లు అజయ్ తెలిపారు. ఫిజికల్ గా తనకి కష్టమైన చిత్రం విక్రమార్కుడు అని అజయ్ తెలిపారు. విక్రమార్కుడు చిత్రం నెగిటివ్ ఇమేజ్ బాగా తీసుకువచ్చింది. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య, ఇష్క్ లాంటి చిత్రాలు తనకి పాజిటివ్ ఇమేజ్ తెచ్చాయి అని అజయ్ తెలిపారు.