MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #Sankranti2024:గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ ఏ OTT లో ..ఎప్పుడు

#Sankranti2024:గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ ఏ OTT లో ..ఎప్పుడు

 ఇప్పుడెక్క‌డ చూసిన సంక్రాంతి సినిమాల గురించే చ‌ర్చ‌. ఈ సీజ‌న్‌లో 5 క్రేజీ తెలుగు సినిమాలు రిలీజ్ కానుండ‌టం ఓపెనింగ్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందోన‌ని నిర్మాతలు  టెన్ష‌న్ ప‌డుతున్నారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Dec 26 2023, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Sankrathi 2024

Sankrathi 2024


ఎప్పటిలాగే  2024 సంక్రాంతి కూడా పంపడ సినిమాలతో హోరెత్తనుంది. ఈ సంక్రాంతికి స్టార్స్ సినిమాలు వరస పెట్టి విడుదల అవుతున్నాయి. వీటిల్లో కొన్ని వెనక్కి వెళితే...థియేటర్స్ సమస్య తప్పుతుందని దిల్ రాజు రిక్వెస్ట్ చేసినా ఎవరూ కూడా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ఉన్నారు. ఈ వరసలో మొదటిగా సంక్రాంతి బరిలో దిగనున్న సినిమా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం. జనవరి 12న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది.

ఇంట్రస్టింగ్ గా అదే రోజు అప్ కమింగ్  యంద్ హీరో తేజ సజ్జ కూడా తన హను మ్యాన్ సినిమాని అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ లో ఎటువంటి మార్పు లేదని భీష్ముంచుకొని మరి కూర్చున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ ఈగ‌ల్, వెంకటేష్ సైంధ‌వ్ చిత్రాలు జ‌న‌వ‌రి 13న రానున్నాయి. నా సామిరంగ జ‌న‌వ‌రి 14న రిలీజ్ అని అతి త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ డేట్స్ నుంచి ఎవ‌రూ త‌మ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవ‌డానికి రెడీగా లేరు. ఈ విషయం ప్రక్కన పెడితే ఈ చిత్రాల ఓటిటి లు ఇప్పటికే డీల్స్ పూర్తయ్యాయి.
  

28

  ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‍లో వస్తున్న మరో చిత్రం హనుమాన్ (Hanu Man Movie). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక హనుమాన్ టీజర్ గ్లింప్స్ అయితే ఆదిపురుష్ విజువల్స్ కంటే మెరుగ్గా ఉన్నాయని టాక్ వచ్చింది. హనుమాన్ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న అంటే సంక్రాంతి బరిలో నిలిపారు.  #Hanuman చిత్రం Zee5 వారు తీసుకున్నారు.

38

అందరూ ముందునుంచి అనుకున్నట్లుగానే పక్కా తెలుగు చిత్రం అనే ట్యాగ్ తో వస్తున్న గుంటూరుకారం సైతం సంక్రాంతికి వస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‍లో వస్తున్న మూడో చిత్రమే గుంటూరు కారం (Guntur Kaaram). ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్న ఈ సినిమాను 2024 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్, మహేశ్ బాబు లుక్స్ మాత్రం తెగ ట్రెండ్ అయ్యాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని Netflix వారు సొంతం చేసుకున్నారు. 

48

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రం ‘సైంధవ్’. సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతి అప్‌డేట్ కోసం యూనిట్ ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఎస్.మణికందన్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్. ఈ చిత్రం రైట్స్ ని Amazon వారు సొంతం చేసుకున్నారు. 

58
Eagle

Eagle

 మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్ లు రెండు ప్లాఫ్ లు ఒక హిట్ అన్నట్లుంది. అయినా  హిట్లు ప్లాప్స్ అని చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో  రవితేజ నటించిన మరో చిత్రం ఈగల్ (Eagle Movie) సంక్రాంతి బరిలోకి దిగనుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈగల్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. ఈ సినిమాకు ఓటిటి హక్కులు ఇంకా విక్రయించలేదు అని తెలుస్తోంది. 

68

 నాగార్జున (Nagarjuna) ఘోస్ట్ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న  చేస్తున్న సినిమా నా సామిరంగ (Naa Saami Ranga). నాగ్ 99వ (Nag 99) చిత్రంగా వస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఆగస్ట్ 29న ఆయన పుట్టినరోజు (Nagarjuna Birthday) సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పాట సైతం రిలీజ్ చేసారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నా సామిరంగ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో నిలిపారు మేకర్స్.  ఈ చిత్రం ఓటిటి రైట్స్ కూడా ఇంకా తేలలేదని వినికిడి. 

78

ఇక ఈ చిత్రాలు రిలీజైన నెల పదిహేను రోజులకు ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడ మరో విషయం గమనించవచ్చు. ఏ ఓటిటి సంస్ద కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే మరో పెద్ద సినిమాను తీసుకోవటానికి ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఒకే వారంలో రెండు పెద్ద సినిమాలు తమ ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తే వ్యూస్ పరంగా బాగా నష్టపోతామని భావిస్తున్నట్లు అర్దమవుతోంది. 
 

88
familystar

familystar

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రీసెంట్ గా ఖుషి (Kushi 2023) సినిమాతో పలకరించాడు. ఖుషి సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యింది. ఇదే కాకుండా మరో రెండు చిత్రాలను ప్లాన్ చేశాడు విజయ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటే.. పరుశురాంతో మరో మూవీ ఉంది. VD13, SVC54గా వస్తున్న విజయ్ దేవరకొండ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనున్నారు. పరుశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ జత కడుతోంది. మరో హీరోయిన్ కూడా ఇందులో కీ రోల్ చేస్తోంది. అయితే ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. ఇక్కడా ఓటిటి బిజినెస్ సమస్య అని తెలిసింది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image3
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved