- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: అభిమన్యుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన యష్.. వేదను అవమానించాలని ఫీక్స్ అయిన మాళవిక!
Ennenno Janmala Bandam: అభిమన్యుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన యష్.. వేదను అవమానించాలని ఫీక్స్ అయిన మాళవిక!
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందుతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

యష్ (Yash) ను తన తల్లిదండ్రులు నీ లోపల ఇంత బాధ పెట్టుకుని మాకు కనీసం చెప్పలేక పోయావా అని అంటారు. ఇక అంతే కాకుండా వేదను పొగుడుతూ అభిమన్యు చేసిన కుట్రలో నీకు బాగా హెల్ప్ చేసింది అని అంటారు. ఇక మేము ఈరోజు హాయిగా నిద్ర పోవడానికి కారణం వేద (Vedha) చెబుతారు.
ఆ క్రమంలో వేద (Vedha) తన భర్త పట్ల ఎంత గౌరవంగా ఉంటుందో.. తన భర్త కి ఎంత గౌరవం ఉంటుందో మాలిని యష్ (Yash) కు అర్థమయ్యేలా చెబుతుంది. అంతేకాకుండా నీకు ఆ భగవంతుడు చేసిన గొప్ప మేలు ఏంటో తెలుసా? నీకు ఒక గొప్ప వారిని ఇచ్చాడు రా అని తన కొడుకుతో మాలిని అంటుంది.
ఆ తర్వాత యష్ (Yash) అభిమన్యు మీద నా అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది అని అంటాడు. ఇక వేద అభిమన్యు దంపతుల దగ్గరకు వెళ్లి ఇలా బతకడం నీకు అవసరమా.. ఈ నీచమైన బ్రతుకు నీకు అవసరమా అని మాళవిక (Malavika) ను అంటుంది. దాంతో అభిమన్యు వేదను చెంపమీద కొట్ట బోతాడు.
ఈలోగా అక్కడకు వచ్చి యష్ వచ్చి అభిమన్యు (Abhimanyu) ను హీరో లెవెల్ లో అడ్డుకుంటాడు. అంతేకాకుండా మెడికల్ రిపోర్ట్ ఇచ్చి ఖుషి నా కన్న కూతురు అని చెప్పి పొడిచినట్టు గా చెప్తాడు. అదే క్రమంలో తన భార్య గురించి ప్రౌడ్ గా కూడా చెప్తాడు యష్ (Yash).
ఇక యష్ (Yash) వేద కు థాంక్స్ చెబుదాం అని అనుకుంటాడు. ఈలోపు వేద ఖుషి (Khushi) పట్ల తాను ప్రవర్తించిన ప్రవర్తన గురించి వివరిస్తూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో యష్ హద్దు పద్దు లేకుండా వాగొద్దు.. నీ హద్దులో నువ్వుండు అని అంటాడు.
ఇక వేద (Vedha) తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ లో వేద కూల్ డ్రింక్ అనుకొని మద్యం సేవిస్తుంది. ఇక ఊగిపోతూ ఆ పార్టీకి వచ్చిన ఒక ఆవిడ మీద పడుతుంది. దాంతో ఆవిడ వేద గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఇక యష్ (Yash)ఆమెను ఏం మాట్లాడుతున్నావ్.. అని విరుచుకు పడి వేద నా భార్య అని దగ్గర గా తీసుకుంటాడు.