- Home
- Entertainment
- Enneno Janmala Bandam: నమ్మకద్రోహం చేశావ్ అంటూ వేదను కొట్టబోయిన మాళవిక.. అభిమన్యుకు షాకిచ్చిన యష్!
Enneno Janmala Bandam: నమ్మకద్రోహం చేశావ్ అంటూ వేదను కొట్టబోయిన మాళవిక.. అభిమన్యుకు షాకిచ్చిన యష్!
Enneno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నెన్నో జన్మల బంధం (Enneno janmala bandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

చిత్ర నైట్ బాగా అలసిపోయినట్లు ఉన్నావు అంటూ వేద (Veda) ను ఫన్నీగా ఏడిపిస్తుంది. మరోవైపు అభిమన్యు.. యశోదర్ (Abhimanyu) కి కాల్ చేయగా పెద్దగా నవ్వుకుంటూ నేనంటే నీకు భయం, వణుకు అంటూ హీరో లెవెల్లో చెబుతాడు.
ఇక అభిమన్యు కోర్టులో ఆల్మోస్ట్ కేసు గెలిచే సాం అయినా గాని యశోధర్ అంతగా ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నాడు అంటూ మాళవిక (Malavika ) తో అంటాడు. ఇక అత్తగారింట్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చూసి వేద (Veda) తినడానికి ఇష్టం లేక నేను టీ తాగుతాను ఆంటీ అని సరిపెట్టుకుంటుంది.
అది తెలుసుకున్న రత్నం (Rathanam) సులోచన ఇంటికి వెళ్లి వేడి వేడి ఇడ్లీ పార్సెల్ చేసుకొని మరీ..వేద కోసం తీసుకొని వస్తాడు. అంతేకాకుండా అత్త గారు చేసిన టిఫిన్ అల్లుడు తినకపోతే ఎట్లా అని .. రత్నం ఆ టిఫిన్ యశోదర్ (Yashodar) కి కూడా పెడతాడు. మరోవైపు ఖుషి వేద కు కాల్ చేసి అమ్మ నేను బోలెడు సంతోషంగా ఉన్నాను.
ఎందుకంటే రేపటి నుంచి నీతోనే ఉండి పోతాగా అని అంటుంది. దాంతో వేద (Veda) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు అభిమన్యు (Abhimanyu) దంపతులు కోర్టులో కేసు మనమే గెలవబోతున్నాము అంటూ ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఇక కోర్టులో ఖుషి ను చూసిన యశోదర్ చాలా ఫీల్ అవుతాడు.
ఇంతలో అక్కడికి అభి వచ్చి బాగా చూసుకో ఇవే నీకు ఖుషి (Khushi) తో ఆఖరి చూపులు అని అంటాడు. ఇక యశోధర్ (Yashodar) కూడా ఏ మాత్రం తగ్గకుండా తనదైన స్టైల్లో అభిమన్యు కి వార్నింగ్ ఇస్తాడు. ఇక కోర్టులో కి వచ్చిన వేద మెడలో మంగళ సూత్రాన్ని చూసిన మాళవిక (Malavika) ఒకసారి గా స్టన్ అవుతుంది.
ఇక ఆ తర్వాత నన్ను వెన్నుపోటు పొడిచావు వేద అంటూ... మాళవిక (Malavika) వేదను చెయ్యేతి కొట్టబోతుంది. దాంతో వేద (Veda) ఆమె చేతిని కొట్టకుండా హీరో లెవెల్ లో పట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో జరుగుతుందో చూడాలి.