- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మరో కుట్రను ప్లాన్ చేసిన అభిమన్యు.. విన్నికి ఐ లవ్ యు చెప్పిన వేద!
Ennenno Janmala Bandham: మరో కుట్రను ప్లాన్ చేసిన అభిమన్యు.. విన్నికి ఐ లవ్ యు చెప్పిన వేద!
Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ టాప్ సీరియల్స్ కి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నా నిజమైన భార్య భర్తలు గా మారాలని తపన పడుతున్న ఒక జంట కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చ్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తన జుట్టుకి సాంబ్రాణి వేసిన భర్తకి థాంక్స్ చెప్తుంది వేద. ఎందుకు థాంక్స్ అంటాడు యష్. నాకు సాయం చేసినందుకు అంటుంది వేద. సాయం చేస్తే బంధం బలపడుతుందంట మీ అత్తగారు చెప్పారు అంటాడు యష్. ఒక భార్యకి భర్త కన్నా ఎవరు ఇంపార్టెంట్ కాదంట మీ అత్తగారు చెప్పారు అంటుంది వేద. నవ్వుతున్న భర్తని చూసి నేను కోరుకున్నది ఇదే కదా, ఒప్పందంతో మొదలైన మన పెళ్లి బంధంగా మారాలి. ఖుషి కి అమ్మగా మీ జీవితంలో స్థానం ఇచ్చిన మీరు మీ భార్యగా కూడా మీ మనసులో స్థానం ఇవ్వాలి, నేనే మీకు ఇంపార్టెంట్ అవ్వాలి అనుకుంటుంది. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నావు భార్యామణి గారు అనుమతి ఇస్తే భవదీయుడు రెడీ అవుతాడు అంటాడు యష్.
అలాగే రెడీ అవ్వండి పతి దేవుడి గారు అంటూ పర్మిషన్ ఇస్తుంది వేద. జరిగిన దానికి ఆనందంలో తేలిపోతూ డాన్స్ చేస్తూ ఉంటుంది వేద. ఇదే ఆనందంతో నా భర్త మీద ఉన్న ప్రేమని అందరి ముందు అనౌన్స్ చేసేస్తాను అనుకుంటుంది. మరోవైపు బిజినెస్ డీలింగ్ మాట్లాడుతున్న అభిమన్యు దగ్గరికి నీకు ఒక గుడ్ న్యూస్ అనుకుంటూ వస్తాడు కైలాష్. ఏంటి అంటాడు అభిమన్యు. తులాభారం అదిరిపోయింది మ్యారేజ్ యానివర్సరీ కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు అంటాడు. ఇది గుడ్ న్యూసా అంటూ కైలాస్ చెంప పగలగొడతాడు అభిమన్యు. ఇది గుడ్ న్యూస్ అంటూ విన్నీ, వేద క్లోజ్ గా ఉన్న ఫోటోలని చూపిస్తాడు. కాలేజీ డేస్ లో వాళ్లు తీయించుకున్న ఫోటోలు చాలా కష్టం మీద సంపాదించాను. కరెక్ట్ గా అక్కడ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడే ఈ ఫోటోలు యశోదర్ కి చేరుతాయి.
అప్పుడు మా బావమరిది రియాక్షన్స్ ఊహించుకుంటేనే భలే ఉంది అనుకుంటూ ఆనంద పడిపోతాడు కైలాష్. ఇది సరిపోదు ఇంకొంచెం డోస్ పెంచాలి. వీటినే వాళ్ళు హగ్ చేసుకుంటున్నట్టుగా, కిస్ చేసుకుంటున్నట్లుగా మార్ఫింగ్ చేసి పంపించు. తన భార్య వేద బాయ్ ఫ్రెండ్ వివిన్ తో కలిసి కాలేజ్ డేస్ లో జరిపిన బాగోతాన్ని చూస్తే వాడి గుండె పగిలిపోతుంది అదే అసలైన కిక్ అంటాడు అభిమన్యు. నేనే నీచుడిని అనుకుంటే నువ్వు నా కన్నా పరమ నీచుడివి అంటాడు కైలాష్. ముందు వెళ్లి పని చూడు అంటాడు అభిమన్యు. ఈ యశోదర్ పెళ్లిళ్లు చెడగొట్టడానికే నేను పుట్టినట్లుగా ఉన్నాను అనుకుంటాడు అభిమన్యు.రెడీ అయిన వేద దగ్గరికి వస్తాడు విన్ని. చూడ్డానికి చాలా బాగున్నావు ప్రిన్సెస్ లాగా ఉన్నావు, ఎప్పుడూ బానే ఉంటావు కానీ ఈరోజు నీ మొహం లో ఏదో వెలుగు కనిపిస్తుంది అంటాడు విన్ని.
ఆ వెలుగుకి కారణం నాకు తెలుసు అంటుంది వేద. ఇంతకీ గిఫ్ట్ ఏది నీకు దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అంటుంది వేద. తేకుండే వస్తే రానిస్తావా అంటూ గిఫ్ట్ ని చూపిస్తాడు విన్ని. వాచ్ ఏదో అన్నావు కదా ఇదేంటి ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది అంటుంది వేద. అనుకున్నాను కానీ దానికన్నా ఈ గిఫ్ట్ బాగుంటుందని తీసుకొచ్చాను అంటాడు విన్ని. ఇంతలోనే ప్లాన్ మార్చేసావా అంటే ఏది చేసినా నీ హ్యాపీనెస్ కోసమే గిఫ్ట్ ని ఓపెన్ చేస్తాడు. వేద, యష్, ఖుషిల పెన్సిల్ స్కెచ్ ఉంటుంది అందులో. అది చూసిన వేద ఎమోషనల్ అవుతూ ఇది గిఫ్ట్ కాదు నా జీవితం అంటుంది. ఈ సందర్భంలో ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది. అసలు నాకే ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన రాలేదు కానీ నీకు వచ్చింది అంటూ థాంక్స్ చెప్తుంది వేద. వేద మీద యష్ కి కోపాన్ని తెప్పించి వాళ్ళిద్దరూ విడిపోయేలాగా చేయాలి అనుకుంటాడు విన్ని. వచ్చిన వాళ్ళందరినీ జంటలుగా కూర్చోబెడుతుంది ఖుషి.స్టేజ్ మీదకు వెళ్లి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తుంది ఖుషి.
మా అమ్మ నాన్నల గురించి చెప్పాలంటే అదంతా నా సంతోషం లోనే కనిపిస్తుంది. అలాంటి అమ్మానాన్నలు దొరకడం నా అదృష్టం ఉంటుంది. నా మనవరాలు పెద్దదైపోయిందని భర్తకి చెప్తుంది మాలిని. కానీ కొడుకు లోనే ఇంకా చిన్నతనం పోలేదు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు అంటాడు రత్నం.అలా ఏం కాదు నేను తనతో మాట్లాడాను అంతకుముందు లాగా ఏ సమస్య ఉండదు అంటుంది మాలిని. ఖుషి మాటలకి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది సులోచన. వాళ్లు ఎప్పటికీ కలిసే ఉంటారు కదా అంటుంది. అంతా బాగానే ఉంటుంది నువ్వేమీ కంగారు పడకు అంటూ సర్ది చెప్తాడు శర్మ.
మరోవైపు స్టేజ్ మీదకి వస్తుంటారు వేద దంపతులు.ఈ క్షణం కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూసాను అనుకుంటుంది వేద.ఈ క్షణాలు మన జీవితంలోనే మధుర క్షణాలుగా మిగిలిపోతాయి అనుకుంటాడు యష్. ఈ సమయం దాటితే అంతా చేయిజారినట్లే ఏదైనా చెయ్యు అని తనలో తానే అనుకుంటాడు విన్ని. మీరంతా సంతోషంగా ఎలా ఉంటారో నేను చూస్తాను అనుకుంటూ సిగరెట్ లైటర్ తీస్తాడు.స్టేజ్ మీద ఉన్న వేద వెల్కమ్ బోర్డు కాలిపోవడం చూస్తుంది. తరువాయి భాగంలో విన్నీకి ఐ లవ్ యు చెప్పి అతనిని హగ్ చేసుకుంటుంది వేద. అది చూసిన యష్ కన్నీరు పెట్టుకుంటాడు.