మోనాల్ మనసులో ఉన్నది నేనేః షాకింగ్ విషయాన్ని వెల్లడించిన అభిజిత్
First Published Dec 4, 2020, 9:04 AM IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్ గురువారం ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అవినాష్‌ని.. మోనాల్ అన్న అని పిలవడం, అవినాష్‌ని, అరియానా చితకబాదడం.. టాస్క్ లో ఉన్న సోహైల్, అఖిల్ మధ్య గొడవ జరగడం వంటి సన్నివేశాలున్నాయి. దీంతోపాటు అభిజిత్, మోనాల్‌లకు సంబంధించిన చర్చ కూడా ఆసక్తికరంగా సాగింది.

మోనాల్‌కి సంబంధించి అభిజిత్, హారికల మధ్య చర్చ జరిగింది. హారిక.. గత వారంలో శనివారం నాగార్జున.. హారికని కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచి క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నెమ్మదిగా రివీల్ చేసింది హారిక.

నాగ్ తనకి క్లాస్ పీకాడని అభిజిత్‌కి చెప్పింది హారిక. మోనాల్‌తో డేట్‌కి వెళ్లాల్సిన టాస్క్ అభిజిత్‌తో చేయించకపోవడం కెప్టెన్‌గా నా తప్పని నాగ్ సర్ చెప్పినట్టుగా వెల్లడించింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?