Ennenno Janmala Bandham: ఆదిత్యను బయటికి నెట్టేసిన అభి.. షాక్ లో యష్ దంపతులు?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భర్తను కాదని మరో వ్యక్తితో వెళ్లిపోయి నడిరోడ్డు పాలైన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎపిసోడ్ ప్రారంభంలో వేద దంపతులు బయటికి వెళ్తూ ఇంట్లో వాళ్లకి వెళ్ళొస్తానని చెప్తారు. క్షేమంగా వెళ్ళండి బాగా ఎంజాయ్ చేయండి వెళ్లిన దగ్గర మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటూ ఓవరాక్షన్ చేస్తుంటారు మాలిని సులోచన. వేదకి విషయం తెలియదు వీళ్ళ ఓవరాక్షన్ చూస్తే తెలిసిపోయేలాగా ఉంది అనుకుంటాడు యష్.
మేం వెళ్ళేది బిజినెస్ మీటింగ్ కి అక్కడ ఎంజాయ్ చేసేది ఏముంది అంటూ అనుమానంగా అడుగుతుంది వేద. అప్పుడు తనకి ఈ విషయం తెలీదు అని అర్థం చేసుకుంటారు మాలిని వాళ్ళు. అదేనమ్మా బిజినెస్ మీటింగ్ అయినా అక్కడ ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ చేసుకుని గుడ్ న్యూస్ తో రండి అని చెప్తుంది మాలిని. మీరెందుకు అంత ఓవర్ ఎగ్జిట్మెంట్ అవుతున్నారు అని అనుమానంగా అడుగుతుంది వేద.
యష్ ఏదో చెప్పి తనని అక్కడ నుంచి తీసుకువచ్చేస్తాడు. మరోవైపు మాళవిక బార్ కు వెళుతుంది. ఏ బ్రాండ్ కావాలి అని అడుగుతాడు బేరర్. నా బాధను తగ్గించే బ్రాండ్ ఏదైతే అది ఇవ్వు అంటూ ఓవర్ గా తాగేస్తుంది మాళవిక. నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే నా వెనుక పడ్డావు నన్ను అందలమెక్కిస్తానన్నావు ఇప్పుడు నడిరోడ్డు మీద తోసేసావు నేను నీకు ఏమన్యాయం చేశాను నన్ను ఎందుకిలా మోసం చేశావు అంటూ బార్ అంతా చిందర వందర చేసేస్తుంది మాళవిక.
ఆమెని కంట్రోల్ చేయడానికి చాలా అవస్థ పడతారు స్టాఫ్. మరోవైపు కారులో వెళ్తూ టెన్షన్ పడుతున్న యష్ ని చూసి ఎందుకంత కంగారుపడుతున్నారు మనం వెళ్ళేది బిజినెస్ మీటింగ్ అయితే కదా అంటుంది వేద. అదే వాళ్ళు నేను ఏం మాట్లాడాలో.. వాళ్లు ఏమంటారో అని టెన్షన్ గా ఉంది అంటాడు యష్. ఇందులో టెన్షన్ పడడానికి ఏముంది మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది సూటిగా కళ్ళలోకి చూస్తూ చెప్పండి. వాళ్లే పాజిటివ్ గా తీసుకుంటారు అంటుంది వేద.
అయితే నేనేం చెప్పినా పాజిటివ్గా తీసుకుంటావు కదా అంటాడు యష్. నాకెందుకు చెప్తున్నారు మీరు మాట్లాడవలసింది బిజినెస్ పార్ట్నర్స్ తో కదా అంటుంది వేద. అవును కదా అంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు యష్. అతని ప్రవర్తనని విచిత్రంగా చూస్తుంది వేద. మరోవైపు తల్లిని పిలుస్తూ ఉంటాడు ఆదిత్య. అంతలోనే అభి, నీలాంబరి కిందకి వస్తారు. అభి డాడీ మమ్మీ ఏది అని అడుగుతాడు ఆదిత్య. నీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అడుగుతుంది నీలాంబరి.
వీడు నా కొడుకేంటి మాళవిక కొడుకు తనని పంపించేస్తే వీడు కూడా వెళ్ళిపోతాడు అనుకున్నాను అంటాడు అభి. మమ్మీ ని ఎందుకు పంపించేసావు తను ఇక్కడే కదా ఉండాలి తీసుకురా అంటూ గొడవ చేస్తాడు ఆదిత్య. అభి నీలాంబరిని పెళ్లి చేసుకున్నాడు ఇకమీదట మీ అమ్మ ఇక్కడ ఉండదు నువ్వు కూడా ఇకమీదట ఇక్కడికి రాకు అంటుంది బ్రమరాంబిక. మా అమ్మని పెళ్లి చేసుకుంటానని ఈవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఈవిడనే బయటికి పంపించేయ్ అంటాడు ఆదిత్య.
ఆ మాటలకి కోప్పడుతుంది నీలాంబరి. అవి కూడా కోప్పడి నిర్దాక్షిణ్యంగా ఆదిత్యని మరెప్పుడు ఇటువైపు రాకు అంటూ బయటికి నెట్టేస్తాడు. సీన్ కట్ చేస్తే హోటల్ కి వచ్చిన వేద మీ పార్ట్నర్స్ ఏరి అని అడుగుతుంది. వాళ్లు కనిపించలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అంటాడు యష్. మరి ఇప్పుడు వాళ్ళని ఎలా కనుక్కుంటారు. అయినా ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు ఆ ప్రాజెక్టు మిమ్మల్ని అంత టెన్షన్ పెడుతుందా అని అడుగుతుంది వేద.
లైఫ్ లో మొదటిసారి చేసే ప్రాజెక్టు కదా ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది అంటూ కవర్ చేస్తాడు యష్. అయినా విషయం చెప్తే వేద కదా టెన్షన్ పడాలి నేనెందుకు టెన్షన్ పడుతున్నాను అనుకుంటాడు యష్. ఎక్కువ ఆలస్యం జరుగుతున్న కొద్ది నాకు టెన్షన్ పెరిగిపోతుంది పద వెళ్దాం అంటాడు యష్. తరువాయి భాగంలో ఆదిత్య యష్ కి ఫోన్ చేసి నాకు భయంగా ఉంది త్వరగా రమ్మని చెప్తాడు. విషయం తెలుసుకున్న యష్ దంపతులు టెన్షన్ పడతారు.