- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: వేదను అలా చూసి షాకైన యష్.. మాళవికని వదిలించుకోవటానికి అభి మాస్టర్ ప్లాన్!
Ennenno Janmala Bandham: వేదను అలా చూసి షాకైన యష్.. మాళవికని వదిలించుకోవటానికి అభి మాస్టర్ ప్లాన్!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న ఒక ఇల్లాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఏదో సాధించాను అని గర్వపడుతున్నావు ఈ ఆరేళ్లలో నువ్వు ఏం సాధించావు. నేను నా భర్త అనురాగాన్ని సాధించాను ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాను. నువ్వు ఎవరినైనా వేలెత్తి చూపిస్తే నాలుగు వేళ్ళు తిరిగి నిన్నే చూపిస్తాయి. అందుకే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకో అప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేద.
మరి వైపు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉండడాన్ని చూసి ఏం జరిగిందో అనుకుంటాడు యష్. ఇంతలో యష్ కొనిపెట్టిన వెస్ట్రన్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చి షాకిస్తుంది వేద. అతను షాక్ లో ఉండగానే డాన్స్ చేసి అదరగొడుతుంది. ఆశ్చర్యపోయిన యష్ ఈ డాన్స్ చేసింది నా భార్యే నా లేక భ్రమ లో ఉన్నానా అంటాడు యష్. భ్రమలోంచి బయటికి రండి నన్ను వెస్ట్రన్ డ్రెస్ లో చూడాలన్న కోరిక తీరింది కదా అంటుంది వేద.
ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు ఇదేదో పార్టీకి వేసుకుంటే బాగుండేది కదా అంటాడు యష్. అసలు బాగోదు నాకు కంఫర్ట్ గా ఉండదు. ఎదిగిన ఆడపిల్ల తల్లిదండ్రుల ముందు కూడా నిండుగా ఉండాలి సందర్భాన్ని బట్టి ఆ అందాన్ని చూసే అవకాశం ఒక భర్తకు మాత్రమే ఉంటుంది అంటుంది వేద. నేను ఈ డ్రెస్ ని మాళవికకి ఇస్తానని ఎలా అనుకున్నారు మీరు ప్రేమతో ఇచ్చిన ఈ డ్రెస్ నేను లైఫ్ లాంగ్ దాచుకుంటాను అంటుంది వేద.
మరోవైపు పెళ్లి ముహూర్తాలు పెట్టించడం కోసం యష్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మాళవిక, వసంత్. అక్కడ ఏమి గొడవ పెట్టుకోవద్దు అంటాడు వసంత్. అంటే నేను గొడవ పెట్టుకునే దానిలాగా కనిపిస్తున్నానా అంటుంది మాళవిక. అలా అని కాదు కానీ నువ్వు వస్తే గొడవలు కచ్చితంగా అవుతాయి అదే భయంగా ఉంది అలా జరగకుండా చూసుకో ఉంటాడు వసంత్.
సరే అంటూ ఇద్దరు బయలుదేరబోతుంటే అభి అక్కడికి వస్తాడు. వసంత్, చిత్రలకు పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారని తెలుసుకొని షాక్ అవుతాడు. నువ్వు ఎందుకు షాక్ అవుతున్నావు అంటుంది మాళవిక. అదేమీ లేదు కానీ అక్క మనిద్దరి పెళ్ళికి ఒప్పుకుంది ఆ గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను. ముహూర్తంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తాళికట్టేయమంది అంటాడు అభి.
ఆనందంతో పొంగిపోతుంది మాళవిక. నేను ఎప్పుడైనా రెడీయే అంటుంది. చిత్ర, వసంత్ ల పెళ్లితో పాటు మనం కూడా పెళ్లి చేసుకుందాము అంటాడు అభి. మంచి ఆలోచన అలాగే చేద్దాం అంటుంది మాళవిక. యష్ ఒప్పుకోడు అంటాడు వసంత్. యష్ ని నువ్వు ఒప్పించు వేదని నేను రిక్వెస్ట్ చేస్తాను అంటుంది మాళవిక. సరే అంటూ ఇద్దరూ బయలుదేరుతారు.
వాళ్లు వెళ్లిన తరువాత ఇద్దరు పెళ్లిళ్లు ఒకే ముహూర్తంలో పెడతారు కానీ 10 నిమిషాల ముందు నీ మెడలో తాళి కట్టి మాళవిక కి ఎగ్జిట్ ఇస్తాను అనుకుంటాడు అభి. మరోవైపు వేదని చూస్తున్న యష్ తో అలా చూడకపోతే వచ్చి జడ వెయ్యొచ్చు కదా అంటుంది వేద. అది నువ్వు నాకు ఇచ్చే వరం అనుకుంటాడు యష్. నీకు జడ వేస్తే నువ్వు నాకు ఏమిస్తావు అంటాడు యష్.
మీ హెల్ప్ నాకు అక్కర్లేదు నేను మా అమ్మతో వేయించుకుంటాను అనటంతో షాక్ అవుతాడు యష్. కంగారు పడిపోతూ వద్దులే నేనే వేస్తాను.. వేసిన తర్వాత గిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అంటాడు యష్. అలా రండి దారికి అంటూ దువ్వెన భర్త చేతిలో పెడుతుంది వేద. జడ వేస్తాడు యష్. చాలా బాగా వేశారు అంటుంది వేద. మరి గిఫ్ట్ సంగతేంటి అంటాడు యష్. నవ్వుతూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది వేద.
వస్తూనే షాక్ అవుతుంది. యష్ కూడా నవ్వుతూ బయటికి వస్తాడు. మాళవిక ని చూసి షాక్ అవుతాడు. ఏంటి వేద చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు ఏదైనా విశేషమా.. ఉంటే చెప్పు నేను నోరు తీపి చేసుకుంటాను అంటూ వెటకారంగా మాట్లాడుతుంది మాళవిక. ఆ మాటలకి కోప్పడతాడు యష్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తాడు.
మొన్న జరిగిన గొడవ చాల్లేద మళ్ళీ ఏ మొహం పెట్టుకోవచ్చావు అంటూ మాలిని కూడా మందలిస్తుంది. తరువాయి భాగంలో పంతులుగారు పెళ్లి ముహూర్తం పెడతారు. అదే ముహూర్తానికి మా పెళ్ళి కూడా జరిగితే బాగుంటుంది అంటుంది మాళవిక. ఏమి బాగోదు దీనికి నేను అసలు ఒప్పుకోను అంటాడు యష్. భర్తని పక్కకు తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోతే వసంత్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని నచ్చచెప్తుంది వేద.