3 వారాలకు అభయ్ నవీన్ బిగ్ బాస్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.. ?
స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న అభయ్ నవీన్.. నోటి దురుసు కారణంగా.. ఓటింగ్ తగ్గి మూడో వారంలోనే బయటకు వెళ్ళిపోయాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు అభయ్ కు మూడు వారాలకు వచ్చిన రెమ్యూనరేషన్ ఎంత..?
బిగ్ బాస్ తెలగు 8 సీజన్ మొదట్లో కాస్త బోర్ కొట్టించినా.. రెండో వారం నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆడియన్స్ కు కావల్సిన మసాలా కలుపుతూ.. బిగ్ బాస్ ను రక్తి కట్టిస్తున్నారు. టాస్క్ లు ఆటలతో హెరెత్తించారు. ఇక మూడో వారం అంతా బిగ్ బాస్ ను వదలకుండా చూసేంతలా మార్చేశారు.
Also Read: ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు ఎవరు..?
ఇక మూడో వారం బిగ్ బాస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న అభయన్ నవీన్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. నిజానికి చాలామంది ఇతను టాప్ 5 లో ఉంటాడు అనుకున్నారు. కాని అతను బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ తో.. ఆడియన్స్ కూ కూడా కోపం వచ్చింది.
అందుకే అభయ్ కు ఓటింగ్ భారీగా తగ్గింది. దాంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవల్సిన పరిస్థితి వచ్చింది. మూడో వారంలో చీఫ్ అయిన అభయ్ .. కాస్త గర్వం పెరిగి.. కళ్ళు నెత్తికెక్కి.. చేసిన కామెంట్స్ తో.. హౌస్ నుంచి బటకు గెంటివేయబడ్డాడు. కాని హౌస్ లో ఉన్నవారు రిక్వెస్ట్ చేయడంతో.. ఆయనకు మళ్ళీ ఎంట్రీ దక్కింది.
Also Read: నాగార్జున భోజనం ప్లేటులో తప్పకుండా ఉండేవి ఏంటో తెలుసా..?
ఇక ఆదివారం ఎలిమినేషన్ టైమ్ కావడంతో.. హౌస్ లో ఎవరూ.. ఊహించని విధంగా అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. శనివారం నాగార్జున కోపం నుంచి తప్పించుకున్నా.. ఆదివారం ఆడియన్స్ ఓటింగ్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు అభయ్. నామినేషన్స్ లో ఉన్న అందరికంటే అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యాడు.
Also Read: ప్రభాస్ నెంబర్ 1, మరి పాన్ ఇండియా హీరోగా సెకండ్ ప్లేస్ ఏ హీరోదో తెలుసా...?
ఇక ఇచ్చిన టాస్కులను సరిగ్గా ఆడక పోవడానికి తోడు పదేపదే బిగ్ బాస్ ను నిందించడం అభయ్ కు పెద్ద మైనస్ గా మారింది. ఓటింగ్ తక్కువగా ఉండటం వల్ల మూడో వారం అతను ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడువారాలకు గాను బిగ్ బాస్ హౌస్ లో అభయ్ రూ. 6 లక్షల వరకు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. వారానికి అభయ్ రెమ్యునరేషన్ రూ. 2 లక్షలు ఇచ్చారని టాక్.
నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో.. బిగ్ బాస్ కు కోపం రావడంతో పాటు.. ఆడియన్స్ కు కూడా చిరాకు వచ్చింది. దాంతో అభయ్ కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. టాప్ కంటెస్టెంట్ గా ఉన్నఅభయ్ హౌస్ నుంచి బయటకు వెల్ళవలసి వచ్చింది.
Abhay Bethiganti
అది కూడా తన స్వయంకృతాపరాదంతో.. బయటకు వెళ్ళిపోయాడు. ఇక స్టేజ్ మీదకు వెళ్ళిన తరువాత అభయ్ చాలా మొచ్చ్యూర్ గా మాట్లాడారు. ఎంత బాగా ఆడినా.. చిన్న పొరపాటు ఆడియన్స్ మనసును విరిచేస్తుంది అన్నట్టుగా హౌస్ మెట్స్ కు సలహాలు ఇచ్చాడు.