అభయ్ నవీన్ ఎలిమినేటెడ్.. నోటి దూల . కొంపముంచిందా..?
బిగ్ బాస్ చరిత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంత వరకూ జరిగిన ఈ 7 సీజన్స్ లో ఎన్నడు లేని విధంగా.. టాప్ కంటెస్టెంట్ గా ఉన్న అభయ్... తన నోటి దురుసు వల్ల ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అనూహ్య పరిణామం జరిగింది. వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఈసారి నామినేషన్స్ లో తానంతట తానుగా వచ్చిన అభయ్ నవీన్.. తాను చేసిన తప్పుల వల్ల హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
Bigg boss telugu 8
రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 8 లో .. రెండు వారాల పాటు చాలా డీసెంట్ గా ఉన్న అభయ్ నవీన్.. ఆతరువాత తన అసలు రూపం చూపించాడు. చీఫ్ గా సెలక్ట్ అయిన అభయ్.. టీమ్ ను లీడ్ చేయడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఎగ్ టాస్క్ లో ఎగ్స్ ను కాపాడుకోలెక చేతులు ఎత్తేశాడు.
పట్టుదలతో గేమ్ ఆడుతున్న మణికంఠ అభయ్ గేమ్ ను గట్టిగా విమర్శించారు. ఇక ఆతరువాత బిగ్ బాస్ మీద అభయ్ నోరు పారేసుకోవడం ఎవరికీ నచ్చలేదు. నోటికి వచ్చినట్టు బిగ్ బాస్ ను తిడుతు.. బుర్రలేదు, బయాస్, బిగ్ బాస్ మీద వ్యతిరేకంగా ఇంటర్వ్యూల్లో చెపుతా.. ఇలా చాలా రకాలుగా బిగ్ బాస్ ను అన్నాడు అభయ్.
దాంతో రెండు మూడుసార్లు బిగ్ బాస్ అభయ్ ను హెచ్చరించినా కూడా తాను ఏమీ అనలేదు అన్నట్టుగానే ప్రవర్తించాడు. నోటికి హద్దు అదుపు లేదు అన్నట్టు గా ప్రవర్తించిన అభయ్ పై వేటు పడింది. నాగార్జున వచ్చీ రాగానే అభయ్ పై ఫైర్ అవ్వడంతో పాటు.. అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ అవుట్ అంటూ గేట్లు తీశారు.
ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉన్నా సరే.. ఎలిమినేట్ అయ్యింది మాత్రం అభయ్ నవీన్ అనేతెలుస్తోంది. ఇక మరో వాదన ఏంటంటే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.. ఒకరు సీక్రేట్ రూమల్ ఉంటారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే అభయ్ నవీన్ మాత్రం ఇంటినించి బయటకు వచ్చేశాడు.
మరి రెగ్యూలర్ ఓటింగ్ లో తక్కువ ఓట్లు వచ్చిన మరో కంటెస్టెంట్ ను బయటకు పంపిస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. . సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడో వారం ఆఖరికి వచ్చేసింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు వెళ్లిపోగా, రెండో వారం శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు.
ఇక మూడో వారం ఎలిమినేషన్ కు సంబంధించి మూడో వారం నామినేషన్స్ లో విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు. అయితే మరో కంటెస్టెంట్ అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేషన్ తో ఈ జాబితాలోకి చేరాడు. ఇప్పుడిదే అతని కొంప ముంచేటట్లు ఉంది.
Bigg Boss Telugu 8
శుక్రవారం సెప్టెంబర్ 21 బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్ కు సంబంధించి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. గత రెండు వారాల్లాగే మూడో వారం ఓటింగ్ లోనూ ఓటింగ్‌లోనూ విష్ణుప్రియ భీమనేనిదే ఆధిపత్యం. ఆ తర్వాత ఎమోషనల్ స్టార్ నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక నైనిక మూడో స్థానంలో ఉండగా.. డేంజర్ జోన్ లో ఉన్న కిర్రాక్ సీత అనూహ్యంగా నాలుగో ప్లేస్ లోకి వచ్చింది. ప్రేరణ ఐదో స్థానంలో ఉండగా.. ఊహించలేని విధంగా యష్మీ గౌడ ఆరో స్థానంలోకి వచ్చేసింది. ఇక అభయ్ నవీన్, పృథ్వీరాజ్ ఆఖరి ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. యష్మీ, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉండగా.. అభయ్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు.