MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆరు సార్లు అబార్షన్లు.. నరకం చూశాను.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన నటి ఆమని..

ఆరు సార్లు అబార్షన్లు.. నరకం చూశాను.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన నటి ఆమని..

సీనియర్‌ నటి ఆమని తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తన అనారోగ్య సమస్యని బయటపెట్టింది. ఆరు సార్లు అబార్షన్‌ చేసుకున్నట్టు తెలిపి షాకిచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 28 2024, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు నటి, అలనాటి హీరోయిన్‌ ఆమని ఫ్యామిలీ కథా చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఎక్కువగా ఆమె ఫ్యామిలీ స్టోరీ సినిమాలతోనే మెప్పించింది. ఇంట్లో ఇల్లాలి పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిందని చెప్పొచ్చు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఆమెని హీరోయిన్‌గా, స్టార్‌ హీరోయిన్ గా చేశాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

1990లో `పుతియకాట్రు` అనే తమిళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఆమని. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `మిస్టర్‌ పెళ్లాం` సినిమాతోనే ఉత్తమ నటిగా నంది అవార్డుకి పోటీ పడింది. `పచ్చని సంసారం`, `శుభలగ్నం`, `అల్లరి పోలీస్‌`, `హలో బ్రదర్‌`, `ఘరానా బుల్లోడు`, `శుభ సంకల్పం`, `శుభమస్తు`, `మావిచిగురు`, `ఆ నలుగురు` చిత్రాలతో అలరించింది. 
 

36

పెళ్లి చేసుకున్నాక హీరోయిన్‌గా కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత 2012 మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కొనసాగుతుంది. చిన్నా, పెద్ద అన్నిరకాల మూవీస్‌ చేస్తుంది. ఇటీవల `మ్యూజిక్‌ షాప్‌ మూర్తి` చిత్రంలో మెరిసింది ఆమని. ఇదిలా ఉంటే తన పర్సనల్‌ లైఫ్‌ గురించి షాకింగ్‌ విషయాలను బయటపెట్టింది ఆమని. 
 

46

అందులో భాగంగా తన అబార్షన్స్ గురించి ఓపెన్‌ అయ్యింది. తనకు ఏకంగా ఆరు ఆబార్షన్స్ అయినట్టు వెల్లడించి షాకిచ్చింది. తాను హీరోయిన్‌గా చేసేటప్పుడు చాలా డైట్‌ చేసేదట. చాలా తక్కువగా తినేదట. మార్నింగ్ జస్ట్ జ్యూస్‌లు తాగేదట. తన డైట్‌ చూసి దాసరి నారాయణరావు కూడా తిట్టేవాడట. హెల్త్ విషయంలో ఎక్కువగా కాన్షియస్‌గా ఉండేదట.  షూటింగ్‌ల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాను ఆ జాగ్రత్తలు తీసుకునేదట. 
 

56

దీని కారణంగా తనకు బ్లడ్‌ డెఫీషియన్సీ వచ్చిందట. ప్రోటీన్‌ ఎస్‌ అనేది తక్కువగా ఉందట. అదేంటో అప్పుడు తెలియలేదని, ఏ డాక్టర్‌ కూడా గుర్తించలేకపోయారని తెలిపింది. దీని కారణంగా పిల్లలు పుట్టలేదని, అలా తాను ఆరు సార్లు అబార్షన్‌ అయినట్టు చెప్పింది. తనకు ఎందుకు గర్భం నిలవడం లేదో అర్థం కాలేదని, డాక్టర్లు కూడా షాక్‌ అయ్యేవారని, ఓ డాక్టర్‌ మాత్రం ఏకంగా తన సమస్య అర్థం కాక తలపట్టుకుందని, నా కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదని, మీ విషయంలో ఓడిపోయామని కూడా చెప్పారట. 
 

66

ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రులకు తిరగ్గా ఓ డాక్టర్‌ గుర్తించారని తెలిపింది ఆమని. ఆ సమస్యని కనిపెట్టేంత వరకు నాకు పిల్లలు కావాలని దేవుడుని వేడుకునేదట. సమస్యని గుర్తించాక ట్రీట్‌మెంట్‌ తీసుకున్నానని, ఆ తర్వాత సెట్‌ అయ్యిందని, పిల్లలు పుట్టినట్టు తెలిపింది ఆమని. ఇలా ఆరు సార్లు అబార్షన్‌ కారణంగా తాను నరకం చూసినట్టు చెప్పింది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక చాలా మానసిక వేదన అనుభవించిందట. ఏడో గర్భం నిలబడిందని చెప్పింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved