- Home
- Entertainment
- Aadhi Pinisetty: గ్రాండ్ గా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని రిసెప్షన్.. తరలివచ్చిన సెలెబ్రిటీలు, ఫోటోస్
Aadhi Pinisetty: గ్రాండ్ గా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని రిసెప్షన్.. తరలివచ్చిన సెలెబ్రిటీలు, ఫోటోస్
హీరో ఆది పినిశెట్టి తెలుగు తమిళ భాషల్లో క్రేజీ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆది పినిశెట్టి రాణిస్తున్నాడు.

హీరో ఆది పినిశెట్టి తెలుగు తమిళ భాషల్లో క్రేజీ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆది పినిశెట్టి రాణిస్తున్నాడు. ఇటీవల ఆది పినిశెట్టి.. అందాల భామ, హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దలని ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో ఆది, నిక్కీ వివాహం గ్రాండ్ గా జరిగింది. కాగా తాజాగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. రిసెప్షన్ పార్టీకి కోలీవుడ్ నుంచి అతిరథ మహారధులు హాజరయ్యారు. నిక్కీ, ఆది నవ దంపతులని ఆశీర్వదించారు.
చెన్నైలో జరిగిన ఈ రిసెప్షన్ ని లెజెండ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కూడా హాజరయ్యారు. అలాగే సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, హీరో జీవా, అరుణ్ విజయ్, నటుడు నాజర్, డైరెక్టర్ హరి.. ప్రీత దంపతులు అతిథులుగా హాజరయ్యారు.
ఆది పినిశెట్టి, నికి గల్రాని ఇద్దరూ ;అందంగా వెలిగిపోతున్నారు. ఆది వైట్ సూట్ ధరించగా.. నిక్కీ గల్రాని లాంగ్ గౌన్ లో మెరిసిపోతోంది. కళ్ళు చెదిరేలా నవ వధూవరులు ఇద్దరూ మెరుస్తున్నారు.
మలుపు చిత్రంతో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వీరిద్దరి వివాహం జరిగింది.
ఇక ఆది పినిశెట్టి హీరోగా రాణిస్తూనే.. సరైనోడు, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో విలన్ రోల్స్ చేశాడు. ఇక రంగస్థలం చిత్రంలో రాంచరణ్ సోదరుడిగా అత్యంత కీలక పాత్రలో నటించాడు.
ఇక నిక్కీ గల్రాని సునీల్ సరసన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. మరికొన్ని చిత్రాల్లో మెరిసింది. టాలీవుడ్ లో నిక్కీ గల్రాని పెద్దగా పాపులర్ కాలేదు.
నిక్కీ గల్రాని ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటన కొనసాగిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.
ఆది పినిశెట్టి చాలా చిత్రాలకు కమిటై ఉన్నాయి. వివాహం కావడంతో షూటింగ్స్ కి కొంత కాలం బ్రేక్ ఇచ్చాడు. ఆది పినిశెట్టి.. సీనియర్ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడు అనే సంగతి తెలిసిందే.
రవిరాజా పినిశెట్టి టాలీవుడ్ లో చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్స్ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. పెదరాయుడు, చక్రవర్తి, మా అన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన దర్శకత్వంలో వచ్చినవే.