- Home
- Entertainment
- బెంగుళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్, ఒక్క రోజుకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సుద్దపూస కుర్రాడా మజాకా
బెంగుళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్, ఒక్క రోజుకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. సుద్దపూస కుర్రాడా మజాకా
బిగ్ బాస్ శివాజీ చాలా కాలం తర్వాత నటించిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సంచలన విజయం సాధించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మీమ్స్, పోస్టులే కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ శివాజీ చాలా కాలం తర్వాత నటించిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సంచలన విజయం సాధించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మీమ్స్, పోస్టులే కనిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో శివాజీ భార్యగా తొలిప్రేమ ఫేమ్ వాసుకి నటించారు. అదే విధంగా స్టాండప్ కమెడియన్ మౌళి, బాల నటుడు రోహన్ రాయ్ నటించారు.
అందరికి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కి సూపర్ క్రేజ్ వచ్చేసింది. సాంప్రదాయని.. సుప్పినీ .. సుద్దపూసని అంటూ రోహన్ నవ్వులు పండించాడు. అదే విధంగా నటనతో ఆకట్టుకున్నాడు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత రోహన్ కి వరుస చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.
ఒక్క వెబ్ సిరీస్ తో రోహన్ దశ తిరిగిపోయినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రోహన్ రాయ్ గురించి సోషల్ మీడియాలో సుద్దపూస అంటూ కామెంట్స్ పెట్టడం మాత్రమే కాదు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ పొందొచ్చని గతంలో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కేరళ పిల్ల ప్రియా వారియర్ కూడా ఒక్క వీడియోతో వింక్ బ్యూటీగా కొన్ని నెలల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.
ఇప్పుడు రోహన్ కి కూడా విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రోహన్ తెలుగు ఫ్యామిలీకి చెందిన పిల్లాడే. కానీ అతడి ఫ్యామిలీ మొత్తం బెంగుళూరులో ఉంటోంది. దీనితో రోహన్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడమే కాదు.. అతడిని బెంగుళూరు నుంచి తీసుకురావడానికి స్పెషల్ ఫ్లైట్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారట.
నిజంగా ఇది స్టార్ హీరో రేంజ్ అనే చెప్పాలి. గతంలో రోహన్ వినయ విధేయ రామ లాంటి చిత్రాల్లో నటించాడు కానీ సరైన గుర్తింపు రాలేదు. గతంలో రోహన్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా రోజుకి 5 వేలు తీసుకునే వాడట. కానీ ఇప్పుడు రోహన్ రోజుకు 30 వేలు డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు ఒకే చెబుతున్నారని అంటున్నారు.
దీనితో నెటిజన్లు సుద్దపూస కుర్రాడా మజాకా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. భవిష్యత్తులో రోహన్ టాలీవుడ్ లో తప్పకుండా బలమైన ముద్ర వేస్తాడని నెటిజన్లు అంటున్నారు.