- Home
- Entertainment
- Jr NTR: నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. 13 ఏళ్ల వయసులోనే శ్రీరాముడిగా..
Jr NTR: నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. 13 ఏళ్ల వయసులోనే శ్రీరాముడిగా..
ఈ జనరేషన్ అద్భుతమైన నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, నటన, డ్యాన్సులతో ఎన్టీఆర్ అభిమానులని మెప్పిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మారింది 2001లో నిన్ను చూడాలని అనే చిత్రంతో. కానీ నటనలోకి బాల్యంలోనే అడుగుపెట్టాడు.

Bala Ramayanam
ఈ జనరేషన్ అద్భుతమైన నటుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, నటన, డ్యాన్సులతో ఎన్టీఆర్ అభిమానులని మెప్పిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మారింది 2001లో నిన్ను చూడాలని అనే చిత్రంతో. కానీ నటనలోకి బాల్యంలోనే అడుగుపెట్టాడు. 1997లో తన 13వ ఏటనే ఎన్టీఆర్ నటనలో ఓనమాలు దిద్దారు.
Bala Ramayanam
1997లో ఎన్టీఆర్.. గుణశేఖర్ దర్శకత్వంలో బాలభారతం చిత్రంలో శ్రీరాముడిగా నటించిన సంగతి తెలిసిందే. బాలభారతం చిత్రం నేటితో 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే ఎన్టీఆర్ నటుడిగా కూడా పాతికేళ్ళు పూర్తయ్యాయి. దీనితో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలు పెట్టారు.
Bala Ramayanam
బలరామాయణలో శ్రీరాముడి పాత్ర నుంచి మొన్నటి ఆర్ఆర్ఆర్ చిత్రంలో భీమ్ పాత్రవరకు ఎన్టీఆర్ అద్భుతమైన కెరీర్ ని గుర్తు చేసుకుంటున్నారు. 1997 ఏప్రిల్ 11న విడుదలైన బాల రామాయణం చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. బాల నటుడిగా ఎన్టీఆర్ ఈ చిత్రంతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. శ్రీరాముడి పాత్రలో ఎన్టీఆర్ తన తాతగారినే మురిపించాడు అంటూ ప్రశంసలు దక్కాయి.
Bala Ramayanam
బాల రామాయణం చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్నారు. యుక్తవయసుకి వచ్చాక హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత రాజమౌళి దర్శత్వంలో స్టూడెంట్ నెం 1 చిత్రంలో నటించాడు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. రాజమౌళికి అదే తొలి చిత్రం.
Bala Ramayanam
మరోసారి వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రం సింహాద్రి. సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ రికార్డులని తిరగరాస్తూ సరికొత్త స్టార్ గా అవతరించాడు. ఇక ఎన్టీఆర్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికి అవి ఎన్టీఆర్ ని అంతగా ఇబ్బంది పెట్టలేదు. యమదొంగ, అదుర్స్, టెంపర్, జనతాగ్యారేజ్, అరవింద సమేత ఇలా వరుస విజయాలతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో జైత్ర యాత్ర కొనసాగించారు.
Bala Ramayanam
రీసెంట్ గా విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు బాల రామాయణంలో ఎన్టీఆర్ స్టిల్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.