కోలీవుడ్ కి భారీ షాక్ ఇచ్చిన రజినీ,సూర్య ఏకంగా 1000 కోట్ల నష్టం, డిటైల్స్
2024లో తమిళ సినిమాకి పెద్ద దెబ్బ తగిలింది. ఏకంగా వెయ్యి కోట్ల నష్టాలను చవి చూసింది. సూర్య, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల చిత్రాలు నిరాశపరిచాయి.
2024 తమిళ సినిమాకి గడ్డుకాలం అని చెప్పొచ్చు. మొదటి ఆరు నెలల్లో ఒకే ఒక్క హిట్ సినిమా వచ్చింది. ఆ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు హిట్ కావడంతో ఊరట దొరికింది. కానీ బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన నేపథ్యంలో పెద్ద మొత్తంలో నష్టాలు సంభవించాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కుదేలయ్యారు.
2024 సంవత్సరంలో 241 తమిళ సినిమాలు విడుదలైనట్లు సమాచారం. వీటిలో 223 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కేవలం 18 సినిమాలు మాత్రమే లాభాలు తెచ్చాయి. 186 సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు. ఈ సినిమాలకి దాదాపు 400 కోట్లు ఖర్చయింది. వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన లాల్ సలాం, వేట్టయన్, కంగువా దారుణంగా దెబ్బ తీశాయి. ఈ చిత్రాలకు కనీస వసూళ్లు రాలేదు.
ఫ్లాప్ టాక్ తో కూడా విజయ్ 'ది గోట్' చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. కేవలం విజయ్ ఫేమ్ కారణంగా భారీ నష్టాలు రాకుండా నిర్మాతలు బయటపడ్డారు. శివకార్తికేయన్ 'అమరన్' అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ మంచి లాభాలు పంచింది. శివ కార్తికేయన్ కి హ్యూజ్ బ్రేక్ ఇచ్చింది. అలాగే ధనుష్ 'రాయన్' లాంటి పెద్ద బడ్జెట్ సినిమా సైతం విజయం సాధించింది.సుందర్ సి 'అరణ్మనై 4' కూడా హిట్ కొట్టి కోలీవుడ్ కి ప్లస్ అయ్యింది.
'డిమాండీ కాలనీ 2' లాంటి చిన్న సినిమాలు కొన్ని బాగా ఆడాయి. 93% సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కోలీవుడ్ కి 1000 కోట్ల నష్టం వచ్చిందని కే. రాజన్ అన్నారు. ఒక్క కంగువా మూవీ నష్టాలే రూ. 180 కోట్ల వరకు ఉన్నాయి. వేట్టయన్, లాల్ సలాం చిత్రాలు కూడా నష్టాలు మిగిల్చాయి. ఈ ఏడాది రజినీకాంత్ నిరాశపరిచాడు. ఆయన నుండి వచ్చిన రెండు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి.
మంచి సినిమాలు వస్తేనే ఈ పరిస్థితి మారుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మలయాళ సినిమాకి కూడా 700 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది భారీ విజయాలు నమోదు చేసింది. కల్కి, పుష్ప 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. దేవర రూ. 500 కోట్లు వసూలు చేసింది. హనుమాన్, టిల్లు స్క్వేర్ వంటి చిన్న సినిమాలు భారీ లాభాలు పంచాయి.