MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

మహేష్ బాబు, కమల్ హాసన్, విశాల్ సహా  12 మంది హీరోలు ఓ కథతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇందేం స్టోరీ అంటూ రిజెక్ట్ చేశారు. కాని ఓ స్టార్ హీరో మాత్రం ఆ కథతో మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా హీరో? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 25 2025, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కొన్ని కథలు వినడానికి అంత బాగోవు, కాని సినిమాగా తీస్తేమాత్రం బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయి. అద్భుతమైన సినిమాలుగా మారుతాయి. కథ బాలేదు కదా అని రిజెక్ట్ చేసిన హీరోలు మాత్రం ఆతరువాత అర్రే..చేసి ఉంటే బాగుండేది అనుకుంటారు. కాని మరికొంత మంది హీరోలు మాత్రం కథను విజ్యువలైజ్ చేసుకుని ఫలితాన్ని ముందుగానే అంచనా వేస్తారు.

అలాంటి సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ కథను 12 మంది హీరోలు తిరస్కరిస్తే.. ఒక్క స్టార్ హీరో మాత్రం నేను చేస్తాను అని ముందుకు వచ్చాడు. అనుకున్నట్టే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆసినిమా ఏదో తెలుసా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ghajini 2

Ghajini 2

ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు గజిని. ఆ హీరో సూర్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సూర్యకంటే ముందు ఈసినిమా  కథ  చాలా మంది హీరోల దగ్గరకు వెళ్ళిందట. కాని హీరో క్యారెక్టరైజేషన్ నచ్చక కొంత మంది. కథ నచ్చక కొంతమంది. ఇతర కారణాలతో మరికొంత మంది ఈసినిమాను రిజెక్ట్ చేశారట.

అందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు అజిత్, మాధవన్, కమల్ హాసన్, విక్రమ్,  విశాల్ లాంటి  12 మంది నటులు ఉన్నారు. కాని సూర్య మాత్రం ఈసినిమా కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గజినీలో సూర్య ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏఆర్‌ మురుగదాస్‌, సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 

36
Ghajini

Ghajini

ఒక్క  తమిళ భాషలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా తెలుగులో  కూడా సూపర్ హిట్ అయ్యింది గజినీ సినిమా. టాలీవుడ్ లో డబ్బింగ్ వర్షన్ హిట్ అవ్వడమే కాదు తెలుగులో సూర్య మార్కెట్  డబుల్ చేసింది గజినీ సినిమా . ఇక ఈమూవీ రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తరువాత తర్వాత  హిందీలో రీమేక్ చేసి విడుదల చేశారు. ఇందులో అమీర్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ లో ఈసినిమా సంచలనంగా మారింది. 

46
Actor Suriya starrer Ghajini film update

Actor Suriya starrer Ghajini film update

హిందీలో ఈసినిమా 100 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. హిందీలో ఈ సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు. అక్కడ భారీ స్పందన రావడంతో ఇతర భాషల్లో కూడా ఈసినిమా రిలీజ్ అయ్యింది. ప్రతీ భాషలో హిట్ అయ్యింది. 

56
Ghajini

Ghajini

సూర్య, అసిన్, జంటగా నటించిన గజిని సినిమాలో ప్రదీప్ రావత్ తో పాటు ప్రస్తుత లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక  AR మురుగదాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దాదాపు రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గజిని బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. 
 

66
suriya starrer ghajini was rejected by r madhavan

suriya starrer ghajini was rejected by r madhavan

అదేవిధంగా బాలీవుడ్ లో రూ.62 కోట్ల బడ్జెట్ తో రూపొందిన గజినీ ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వరకు వసూలు చేసింది. ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది. మెమెరీ పవర్ ను లాస్  అయిన  సూర్య, నయనతార సహాయంతో తన ప్రేయసి అసిన్ హంతకులను కనుగొని ప్రతీకారం తీర్చుకోవడం గజినీ కథ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved