అమ్మలను మించిన అందం.. ఈ క్రేజీ హీరోయిన్లంతా ఎవరి కూతుళ్లో తెలుసా?

First Published 7, Feb 2020, 10:58 AM IST

అబ్బాయిలను ఇండస్ట్రీకి పంపడానికి పెద్దగా ఆలోచించరు కానీ అమ్మాయి విషయంలో చాలా కాలిక్యులేషన్స్ చేసుకుంటారు. అయితే సినిమా మీద ఇష్టంతో కొందరు హీరోయిన్లు తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 

సినిమాలో ఇండస్ట్రీలో వారసత్వంతో వచ్చిన నటులు చాలా మంది ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పటి హీరోయిన్ల కూతుర్లు కూడా ఇప్పుడు హీరోయిన్లుగా మారుతున్నారు. అబ్బాయిలను ఇండస్ట్రీకి పంపడానికి పెద్దగా ఆలోచించరు కానీ అమ్మాయి విషయంలో చాలా కాలిక్యులేషన్స్ చేసుకుంటారు. అయితే సినిమా మీద ఇష్టంతో కొందరు హీరోయిన్లు తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాంటి తల్లీకూతుళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!

వేదవల్లి - జయలలిత : నటిగా, రాజకీయనాయకురాలిగా చరిత్ర సృష్టించిన జయలలిత గురించి చాలా మందికి ఓ విషయం తెలియదు. అదేంటంటే ఆమె తల్లి వేదవల్లి కూడా సినిమాల్లో నటించారు. జయలలిత ఇండస్ట్రీ వైపు రావడానికి వాళ్ల అమ్మే పెద్ద కారణం.

లక్ష్మి - ఐశ్వర్య : సీనియర్ నటి లక్ష్మి ఒకప్పుడు హీరోయిన్ గా చాలా బిజీ. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ లో నటించి మరెన్నో అవార్డులను అందుకున్నారు. ఆమె కూతురు ఐశ్వర్యని కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తరువాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు.

శ్రీదేవి - జాన్వీ కపూర్ : అతిలోక సుందరి శ్రీదేవి నటిగా ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకి కోట్లలో అభిమానులున్నారు. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. త్వరలోనే శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

జీవిత - శివాత్మిక, శివాని :  నటి జీవిత నిర్మాతగా, దర్శకురాలిగా కూడా సినిమాలు తీశారు. తన పెద్ద కూతురు శివానీని '2 స్టేట్స్' రీమేక్ తో పరిచయం చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తన రెండో కూతురు శివాత్మిక మాత్రం 'దొరసాని' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది.

రాధ - కార్తిక, తులసి : ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా రాణించిన రాధ తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్లుగా పరిచయం చేసింది. కానీ వారిద్దరూ తల్లి స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.

లిజీ - కళ్యాణి ప్రియదర్శన్ : లిజీ తెలుగు కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఆమె తన కూతురు కళ్యాణిని హీరోయిన్ గా పరిచయం చేశారు. 'హలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి మంచి గుర్తింపే సంపాదించుకుంది. ఆ తరువాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాల్లో నటించింది.

మేనక - కీర్తి సురేష్ : 'పున్నమినాగు' సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మేనక పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు కూతురిగా ఎంట్రీ ఇచ్చి 'మహానటి'గా క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్.

మంజుల - ప్రీతి, శ్రీదేవి, వనిత : ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన మంజుల ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తన ముగ్గురుకూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ వీరు ఎక్కువ కాలం నటీమణులుగా కొనసాగలేకపోయారు.

సారిక - శృతిహాసన్, అక్షర హాసన్ : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన సారిక ఎన్నో హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. తన ఇద్దరు కూతుళ్లు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. శృతిహసన్ అగ్ర హీరోయిన్ గా కెరీర్ కొనసాగించింది. అక్షర ఇప్పుడిప్పుడే తన కెరీర్ ని మలుచుకుంటోంది.

రోజా -అన్షుమాలిక : హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన రోజా ఇప్పటికీ నటిగా అప్పుడప్పుడు మెరుస్తుంటుంది. ఆమె కూతురు అన్షు టీనేజర్ అయినప్పటికీ ఆమెని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.

loader