MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • #VishwakSen: బూతుతో రిప్లై ఇచ్చిన విశ్వక్‌, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడా?

#VishwakSen: బూతుతో రిప్లై ఇచ్చిన విశ్వక్‌, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడా?

విజయ్ దేవరకొండలా యూత్ కు నచ్చే యాటిట్యూడ్ తో , తనకు నచ్చినట్టు సినిమా చేయడంలో.. అలాగే ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లటంలో  ఎప్పుడూ ముందుంటాడు విశ్వక్‌ సేన్‌. అయితే ఈ సమయంలో వివాదాలు అతన్ని చుట్టబుడున్నాయి. తాజాగా యాక్షన్‌ కింగ్ అర్జున్‌తో చేస్తున్న సినిమా విషయంలో వివాదం రావడంతో రీసెంట్‌గా మరోసారి వార్తల్లో నిలిచాడు.

4 Min read
Surya Prakash
Published : Nov 10 2022, 06:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111


 ఒక్కో సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశ్వక్. అతని చేతిలో కూడా దాపు అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించగా ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత విశ్వక్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విడుదల అయ్యి, మంచి పేరే తెచ్చిపెట్టింది. రీసెంట్ గా విశ్వక్ నటించిన ఓరి దేవుడా మాత్రం వర్కవుట్ కాలేదు.

211
vishwak sen ,arjun sarja

vishwak sen ,arjun sarja


గత నాలుగు రోజులుగా మీడియాలో విశ్వక్ సేన్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. విశ్వక్‌ సేన్‌పై సీనియర్‌ స్టార్ హీరో అర్జున్‌ సర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అటు అర్జున్ , ఇటు విశ్వక్ సేన్ మీడియా సాక్షిగా ఎవరి వెర్షన్ వారు వినిపించారు. జనం ఇద్దరినీ తప్పు పడుతున్నారు. విశ్వక్ కు ఓ రోజు టైమ్ ఇవ్వలేకపోయారా అని అర్జున్ ని నిలదీస్తూనే..ఇంత యాటిట్యూడ్ పనికి రాదు..ఓ సీనియర్ హీరోని, డైరక్టర్ తో బిహేవ్ చేసే పద్దతి ఇదేనా అని విశ్వక్ ని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై డిస్కషన్స్ జరుగుతున్నాయి. విశ్వక్ కు ఇలా డైరక్టర్స్ ని ఆడుకోవటం మామూలే అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో విశ్వక్ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. 

311
Vishwak Sen

Vishwak Sen


విశ్వక్ సేన్ #KM ( hint : M - mui ) ...ఓ బూతు పదంతో ట్వీట్ చేసి షాక్ ఇచ్చారు. ఇది అర్జున్ ని ఉద్దేశించి అన్న మాట అని కొందరు అంటున్నారు. మరికొంతమంది...అదేం లేదు..తనను జడ్జ్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్న జనాలను ఉద్దేశించి అన్న మాటలు అని అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా కెరీర్ లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న నటుడు ఇలా అనకుండా ఉంటే బాగుండేది అని ఇండస్ట్రీలో సీనియర్స్ అంటున్నారు. ఎవరేమన్నా..అనుకున్నా అతను అనేసాడు.

411


ఇందుకు కారణాలు ఓ సారి చూస్తే... ఓ చిత్రం విషయంలో దర్శక, నటుడు అర్జున్‌ (Arjun), విశ్వక్‌కు మధ్య విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకు కారణం హీరో విశ్వక్ సేన్ అని, అతను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ రావడం వల్లనే సినిమా డిలే అవుతుందని ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అర్జున్. అంతేకాదు విశ్వక్ సేన్ డెడికేషన్ లేని హీరో అని.. అతనికి ప్రొఫెషనలిజం అంటూ లేదని అర్జున్ మండిపడ్డాడు. 

511


దానిపై విశ్వక్‌ స్పందించారు. తనంతటి ప్రొఫెషనల్‌ నటుడు లేరని, అలాంటి తనకు కమిట్‌మెంట్‌ లేదని ఒక్క లైట్‌బాయ్‌ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అన్నారు. ‘రాజయోగం’ సినిమా టీజర్‌ విడుదలకు అతిథిగా హాజరైన విశ్వక్‌ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడా కామెంట్స్ పై ఇండస్ట్రీలో,సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. విశ్వక్ సేన్ వాదన లో న్యాయం ఉందా లేదా అనే ముందు ఆయన ఏమన్నారో చూడండి..

611


‘‘నటుణ్ని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. అవమానాలు ఎదుర్కొన్నా. ‘ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కదా’ అనుకుంటూ వాటి గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, నటులుగా మేం మాత్రం వాటినే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని. ఏదో అవకాశం వచ్చేసింది కదా అని నేను సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటా. అది పూర్తయిన తర్వాత ప్రచారాన్ని భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా. నా అంత కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ నటుడు ఉండడు. 

711


ఈ ఏడాది నేను మూడు చిత్రాలు పూర్తి చేశా. వాటిల్లోని ఒకదానికి నేనే దర్శకుడు, నిర్మాత, హీరో. నా వల్ల ఇప్పటివరకూ ఏ నిర్మాతా బాధపడలేదు, ఒక్క రూపాయి నష్టపోలేదు. భయపడే చిన్న ప్రొడ్యూసర్స్‌తో నేను పనిచేయలేదు. నేను చేసినవి చిన్న చిత్రాలే అయిండొచ్చు కానీ వాటిని పెద్ద నిర్మాతలు నిర్మించారు. నా సినిమాల సెట్‌లోని ఒక్క లైట్‌బాయ్‌ అయినా.. నన్ను కమిటెడ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌ కాదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. కొత్త దర్శకుడు అయినా, అనుభవం ఉన్న దర్శకుడితో అయినా ‘గివ్‌ అండ్‌ టేక్‌’ పద్ధతిలో పనిచేశా. అన్ని సినిమాల్లానే అర్జున్‌గారి చిత్రానికీ అదే అనుకుని ప్రారంభించా’’ అన్నారు.

811


‘‘చిత్రీకరణ మొదలయ్యే వారం ముందు నాకు ఈ సినిమా స్క్రిప్టు అందింది. ‘నేను ఆఫీస్‌ బాయ్‌ ఇన్‌పుట్‌ కూడా వింటా’ అని అర్జున్‌ సర్‌ అన్నారు. ‘నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్‌’ అని చెబితే నువ్వు వదిలేయ్‌, నన్ను నమ్ము అంటూ ఏం చెప్పనిచ్చేవారు కాదు. పది విషయాల్లో..  రెండు నా ఇష్టానికి వదిలేసినా ప్రయాణం అలా సాగిపోయేది. కానీ, నన్ను కట్టిపడేశారు. కళ్లుమూసుకుని కాపురం చేసేయ్‌ అన్నట్టుంది వ్యవహారం. అయినా ఏదో విధంగా ముందుకెళ్లానుకొని, లుక్‌ టెస్ట్‌లో పాల్గొని ఆయనకు పంపించా.

911
విశ్వక్ సేన్: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ ప్రత్యేకమనే చెప్పాలి. తన కథల సెలెక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవిష్యత్తుల్లో అతడి నుండి మరిన్ని కొత్త తరహా చిత్రాలు రావడం ఖాయం.

విశ్వక్ సేన్: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ ప్రత్యేకమనే చెప్పాలి. తన కథల సెలెక్షన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవిష్యత్తుల్లో అతడి నుండి మరిన్ని కొత్త తరహా చిత్రాలు రావడం ఖాయం.


 మరుసటి రోజు లేచి, షూట్‌కు బయలుదేరేముందు ఎందుకో భయమేసింది. నాకు ఏ సినిమాకీ ఇలా అనిపించలేదు. అందుకే ‘సర్‌.. ఈ ఒక్కరోజు షూటింగ్‌ రద్దు చేస్తే.. కొన్ని విషయాలు చర్చించుకుందాం’ అని మేసేజ్‌ పెట్టా. నేనూ మా మేనేజరు ఎన్నిసార్లు అడిగినా ఆయన నుంచి సమాధానం లేదు. అదేరోజు మధ్యాహ్నం వాళ్ల మేనేజరు నుంచి.. ‘ఇంకేంటి మాట్లాడేది’ అంటూ అకౌంట్‌ వివరాలు పంపించారు. చిత్రం నుంచి వైదొలుగుతానని నేను చెప్పలేదు, సినిమాని నేను ఆపలేదు’’

1011
vishwaksen

vishwaksen


‘‘షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్‌ చేయటం తప్పే. కానీ, నాలుగు రోజులు అయిష్టంగా పనిచేసి తర్వాత కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలనుకోవటం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. అంత గౌరవం ఇచ్చా. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టడం వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ, స్నేహితులు బాధపడుతున్నారు. నేనేం చేయాలి? నన్ను ఆ సినిమా నుంచి తొలగించారు. అలాంటప్పుడు ఆయన చిత్రం గురించి నేనెందుకు మాట్లాడాలి? అనుకున్నా కాబట్టే నిన్న స్పందించలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి.. ఇప్పుడే పరిశ్రమ నుంచి వెళ్లిపోతా. నా వల్ల మీకు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్‌’’ అని విశ్వక్‌ సేన్‌ అర్జున్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

1111


 ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ టైటిల్ తో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తుండగా వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు. ధమ్‌ కీ సినిమా నుంచి డైరెక్టర్‌ తప్పుకోవడంతో విశ్వక్‌ సేన్‌ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నట్టు ఇన్‌ సైడ్‌ టాక్‌. కాగా ధమ్‌ కీ టీజర్‌ రెడీ అయిందని, అందరినీ ఇంప్రెస్‌ చేసేలా ఉండబోతుందని సమాచారం.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved