- Home
- Entertainment
- Entertainment News
- విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న లవ్ ట్రాక్ కన్ఫమ్.. ఇన్నాళ్లకు హింట్ ఇచ్చిన నేషనల్ క్రష్.!
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న లవ్ ట్రాక్ కన్ఫమ్.. ఇన్నాళ్లకు హింట్ ఇచ్చిన నేషనల్ క్రష్.!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ - నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ లో ఉన్నారని మరోసారి కన్ఫమ్ అయ్యింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారీ స్టార్స్. ఈ సందర్భంగా వారి మధ్య రిలేషన్ పై రష్మిక ఇచ్చిన ఓ హింట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి కదలికలు కూడా ఒకరిపై మరొకరంటే ఇష్టమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
గతంలో బెంగళూరులోని ఓ రెస్టారెంట్ లోనూ వీరిద్దరూ మీడియా కంటికి చిక్కిన విషయం తెలిసిందే. అదేగాక ప్రతి తెలుగు పండగలకు కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వచ్చివెళ్తున్నట్టుగా కూడా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో చాలా జాగ్రత్త పడుతున్నప్పటికీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
నిన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ ఎయిర్ పోర్టులో దర్శనమివ్వడం.. ఒకే సమయంలో ఈస్టార్స్ మాల్దీవులకు వేకేషన్ నిమిత్తం వెళ్లడం వారి మధ్య లవ్ ట్రాక్ ను కన్ఫమ్ చేస్తున్నాయి. ఇదీగాక మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్న అభిమానులకు పరోక్షంగా విజయ్ పై ఉన్న ప్రేమను తెలియజేసింది.
ఈ మేరకు తాజాగా రష్మిక నెట్టింట షేర్ చేసిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. ఫొటోలో రష్మిక మందన్న ట్రెండీ వేర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. అయితే ఈ పిక్ లో రష్మిక పెట్టుకున్న గాగూల్స్ ఇప్పుడు చర్చగా మారింది.
ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ పెట్టుకున్న సన్ గ్లాసెస్ నే రష్మిక కూడా మాల్దీవుల్లో పెట్టుకొని కనిపించడం వీరి ఇద్దరూ కలిసే వేకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్, రష్మిక ఫొటోలను జతపర్చుతూ అభిమానులు, నెటిజన్లు వారి లవ్ ట్రాక్ కన్ఫమ్ అని భావిస్తున్నారు.
కానీ ఇంత వరకు అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఎప్పుడూ వారి రిలేషన్ పై స్పందించడం లేదు. కనీసం నెట్టింట వస్తున్న రూమర్లను కూడా ఖండించడం లేదు. దీంతో ఇదే నిజమై ఉంటుందని ఇంటర్నెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మేరకు వీరిద్దరి ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు. విజయ్ ప్రస్తుతం ‘ఖుషీ’లో నటిస్తున్నాడు. రష్మిక ‘పుష్ప ది రూల్’లోనూ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.