కక్కుర్తితో కారులో చేసా...శృంగారంపై ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ
మొదటి నుంచి విజయ్ దేవరకొండది ఏగ్రిసివ్ యాటిట్యూడ్,. అతని బిహేవియర్ పలుమార్లు వార్తలకెక్కింది. ఫేమస్ అయిన ప్రతి సెలెబ్రిటీకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.రౌడీ యాటిట్యూడ్, లెక్కచేయని తత్వం విజయ్ దేవరకొండ ప్రత్యేకత. రౌడీ హీరో అని గొప్పగా పిలిపించుకునే విజయ్ దేవరకొండ... ఆ పేరున ఓ బ్రాండ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. రౌడీ బ్రాండ్ బట్టలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పబ్లిక్ లో ఒద్దికగా ఉండాలి, డిప్లొమాటిక్ గా మాట్లాడాలి అనేది సెలెబ్రిటీలు ఫాలో అయ్యే సూత్రం. దీనికి భిన్నం విజయ్ దేవరకొండ. పబ్లిక్ వేదికలపై కూడా తన అగ్రెసివ్ నేచర్ చూపిస్తాడు. తాజాగా మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లోకి ఎక్కాడు. హాట్ టాపిక్ గా మారారు.

బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షో లెటెస్ట్ ఎపిసోడ్‌లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే సందడి చేసారు. ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్ కు చెందిన ప్రోమో విడుదల చేసారు. అందులో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో కు ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. బాలీవుడ్ లో ఉండే ప్రతి స్టార్ ఈ షోకి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ తాజాగా ఏడో సీజన్ తో రానుంది. అయితే ఈ సారి షో ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది. ఇందులో విజయ్ దేవరకొండను సెక్స్ జీవితంపైనా ప్రశ్నలు వేసారు.
కరుణ్ జోహార్ స్టైయిట్ గా విజయ్ దేవరకొండను..నువ్వు ఎప్పుడు చివరగా సెక్స్ చేసావు అని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్పబోతూంటే ప్రక్కనే ఉన్న అనన్య పాండే అందుకునే ఈ రోజు ఉదయం అయ్యి ఉండచ్చు అని చెప్పింది. దానికి కరణ్ జోహార్ కౌంటర్ వేసారు. దానికి విజయ్ దేవరకొండ పెద్దగా నవ్వేసారు
అలాగే నువ్వు పబ్లిక్ ప్లేస్ లలో చేయటానికి ఇష్టపడతావా లేక అంటే విజయ్ దేవరకొండ కార్స్ అన్నాడు. అంటే డైరక్ట్ గా శృంగారం గురించే ఆ ప్రస్తావన. దానికి అనన్య పాండే ఓ రేంజిలో కార్స్ లోనా అన్న అని ఓ రేంజిలో ఎక్సప్రెషన్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ కారుల్లో చేస్తాను అనగానే కరుణ్ జోహార్ కంటిన్యూ చేస్తూ అక్కడ కంపర్టబుల్ గా ఉంటుందా అని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ డెస్పరేట్ టైమ్స్ అంటే దాదాపు తప్పించుకోలని కక్కుర్తి గా ఉన్న పరిస్దితుల్లో అన్నట్లు సమాధానం చెప్పి కన్ను కొట్టారు. దానికి కరుణ్ జోహార్ ఓ రేంజిలో ఎక్సప్రెషన్ ఇచ్చారు.
కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని తీసుకురాబోతున్నారు. రీసెంట్ గా సౌత్ సినిమాలు, సౌత్ యాక్టర్స్ బాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సౌత్ వాళ్ళని కూడా కరణ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ సీజన్ లో చరణ్, తారక్, నయనతార.. ఇలా పలు సౌత్ స్టార్లు రానున్నట్టు సమాచారం.
ఇప్పటికే సమంతల ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సారి సౌత్ సెలబ్రిటీలు వస్తుండటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కాఫీ విత్ కరణ్ గతంలో కంటే కూడా ఈ సారి మరింత సక్సెస్ అవ్వొచ్చు అని భావిస్తున్నారు నిర్వాహకులు.
కరణ్ గతంలో ఈ షోలో అనేక మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాడు. రాఖీ సావంత్, కపిల్ శర్మ, రానా దగ్గుబాటి, ప్రభాస్, హార్దిక్ పాండ్యా, కేఎల్. రాహుల్ తదితరులు ఈ చాట్ షోలో సందడి చేశారు. కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్-7’ కు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో గతంలోనే ఇచ్చాడు.
‘‘ప్రతి గొప్ప కథకు ఓ మంచి ట్విస్ట్ తప్పక ఉండాలి. ‘కాఫీ విత్ కరణ్’ తిరిగి టీవీలో ప్రసారం కాదు. ఈ చాట్ షో 7వ సీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్’ లో ప్రసారం కానుంది. భారత్‌కు చెందిన పెద్ద తారలందరూ కాఫీ తాగుతూ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వదంతులకు చెక్ పెట్టి లోతైన చర్చలను జరపడానికి ఈ షో సిద్ధంగా ఉంది’’ అని ట్విట్టర్‌లో కరణ్ పోస్ట్ పెట్టాడు.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా లైగర్ (Liger). పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ముంబైని తాకింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ కు పోటీ ఇచ్చే లెవెల్‌లో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ కనిపిస్తోంది.
ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. విజయ్- అనన్య స్క్రీన్ ప్రెజెన్స్ యువతకు పిచ్చెక్కిచందట. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.