ఎన్టీఆర్ రిక్వెస్ట్ కు స్పందించిన వెట్రిమారన్, ఏమన్నారంటే
ఎన్టీఆర్ విషయానికి వస్త మాస్ ఫాలయింగ్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.
Vetrimaaran, NTR, devara
తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. తన సినిమాల్లో సామాజిక స్పృహ, సహజత్వం కలబోసి నడుస్తాయి. తన కెరీర్ ప్రారంభం నుంచి రా అండ్ రస్టిక్ సినిమాలతో డైరక్టర్ గా తనదైన ముద్రతో సాగిపోతున్నారు .
అదే సమయంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ విషయానికి వస్త మాస్ ఫాలయింగ్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. దాల్చితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
Junior NTRs Vetrimaaran Tamil film updates out
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఆయన చేయబోయే సినిమాల గురించి ఇంట్రస్టింగ్ విషయాలు మాట్లాడుతున్నారు. ఈమధ్య చెన్నైలో జరిగిన విలేకర్ల సమావేశంలో వెట్రిమారన్‌తో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
Vetrimaaran
తమిళంలో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? అది ఏ దర్శకుడితో? అని వ్యాఖ్యాత ఎన్టీఆర్‌ను అడగ్గా…తమిళంలో వెట్రిమారన్ తన ఫేవరేట్ దర్శకుడని, ఆయనతో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని ఎన్టీఆర్ చెప్పారు.
దీంతో వీరిద్దరి కాంబినేషన్ గురించి మరోమారు చర్చలు మొదలయ్యాయి. అయితే నాలుగేళ్ల క్రితమే ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ సినిమా చేయబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
vetrimaaran
వెట్రిమారన్ కూడా ఈ సినిమా గురించి స్పందించారు. సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వెట్రిమారన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కి ఇప్పటికే ఓ స్క్రిప్ట్ వినిపించానని, ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే ఆయనతో చేయనున్న సినిమాపై దృష్టిపెడతానని చెప్పారు.
లాక్‌డౌన్ తర్వాత తాను ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పానని వెట్రిమారన్ ఓ సందర్భంలో చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆ వీడియో నాలుగేళ్ళ క్రితం నాటిది. అంటే అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతన్నాయన్నమాట.
vetrimaaran
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ ఈ నెల 27న రానున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ హీరోగా... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా చిత్రీకరణ అక్టోబరు 21 నుంచే ప్రారంభం అవుతుందని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
40 రోజులపాటు సాగే తొలి షెడ్యూల్‌లో తాను పాల్గొననని, జనవరి నుంచి తనపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలిపారు ఎన్టీఆర్. ఆ సినిమా పూర్తయిన తర్వాత ‘దేవర 2’ పట్టాలెక్కనుంది.