వివి వినాయక్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారా? అసలు నిజం ఏమిటి?!
VV Vinayak : ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కోలుకుంటున్న ఆయన, తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. అసలు నిజం ఏమిటి .
- FB
- TW
- Linkdin
Follow Us
)
Veteran director VV Vinayak Sick Again? in telugu
VV Vinayak : తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వి.వి. వినాయక్ . ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరిగింది.
అప్పటి నుంచి ఆయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారని, . వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Veteran director VV Vinayak Sick Again? in telugu
రీసెంట్ గా వి.వి. వినాయక్ అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలుసుకున్న దర్శకుడు సుకుమార్, నిర్మాత దిల్ రాజు వంటి కొందరు సినిమా సెలబ్రెటీలు ఆయన ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అయితే అసలు నిజం వేరుగా ఉంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం చెప్తూ ఆయన టీమ్ ఓ ప్రెస్ నోట్ ని పంపింది. అందులో ఇలా ఉంది
ప్రముఖ దర్శకులు వి వి వినాయక్ గారు ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును
Veteran director VV Vinayak Sick Again? in telugu
తారక్ నటించిన ‘ఆది’చిత్రంతో వీవీ వినాయక్ (VV Vinayak) దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఏర్పడింది.
ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించిన వీవీ వినాయక్ కూడా స్టార్ స్టేటస్ లోనే కొనసాగుతున్నారు.
అయితే, కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవ్వడంతో ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు.
చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సీనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది నిలిచిపోయిందని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు.