దర్శకుల్లో మగధీరుడు... రికార్డుల్లో బహుబలి!

First Published 10, Oct 2019, 12:40 PM

ఎస్.ఎస్.రాజమౌళి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన టాలెంట్ కాదతడిది. తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి.

ఎస్.ఎస్.రాజమౌళి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన టాలెంట్ కాదతడిది. తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. 18 సంవత్సరాల క్రితం 'స్టూడెంట్ నెం. 1' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి అప్పటినుండి వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈరోజు మన జక్కన్న పుట్టినరోజు కావడంతో ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

ప్రముఖ సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడైన రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు వద్ద శిష్యురికం మొదలు పెట్టిన రాజమౌళి ఆ తర్వాత అగ్ర దర్శకుడిగా ఎదిగాడు.

సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేశాడు రాజమౌళి. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో 'స్టూడెంట్ నెం.1' సినిమా తీసి దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు.

దర్శకధీరుడు రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందంటే.. ప్రముఖ యాంకర్ సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఆ పేరు పెట్టారని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి డైరక్ట్ చేసిన శాంతినివాసం సీరియల్‌లో రాజీవ్ హీరోగా నటించారు. రాజమౌళి సీరియల్/ సినిమా ఏది తీసినా ఓ శిల్పంలా చెక్కుతాడని అందుకే రాజీవ్ ముద్దుగా ఆ పేరు పెట్టాడని తెలిసింది.

రాజమౌళి, రమ వివాహం 2001లో చాలా సింపుల్ గా జరిగింది. రమను రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నారు. రమ మరెవరో కాదు... రాజమౌళి కజిన్ కీరవాణి భార్య, శ్రీవళ్లికి స్వయాన చెల్లెలు. అయితే రమకి ఇది రెండో పెళ్లి. అప్పటికే ఆమెకి మరొక వ్యక్తితో పెళ్లై విడాకులు తీసుకుంది. కార్తికేయ రాజమౌళి బయోలాజికల్ సన్ కాదు. రమ మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానమే కార్తికేయ.

రాజమౌళి తన వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో.. ఫ్యామిలీ విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉంటారు. ఆయనకి సినిమాలు, కుటుంబం తప్ప మరో ధ్యాస ఉండదు.

రాజమౌళి ప్రతి సినిమా అయిపోగానే రిలాక్స్ అవ్వానికి వెకేషన్ వెళతాడు. అక్కడే తన తర్వాతి సినిమాకు సంబంధించిన ఆలోచన మొదలవుతుంది. తనకు వచ్చిన ఆలోచన ముందు ఆయన తన భార్య రమతోనే ముందుగా పంచుకుంటారు.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. రాజమౌళికి మతిమరుపు ఉందట. పనిలో పడితే మిగిలిన విషయాలన్నీ మర్చిపోతారట. కొన్ని సార్లు తనకు తెలియకుండానే వేరొకరి వస్తువులను జేబులో వేసుకొస్తుంటారట. సినిమా చేస్తున్నంతసేపూ కూడా రాజమౌళి చాలా అయోమయంగా ఉంటారని చెబుతుంటారు.

రాజమౌళి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా వీక్.. చెక్కుల మీద ఆయన సంతకాలు ఒక్కోసారి ఒక్కోలా పెట్టడంతో చాలా సార్లు చెక్కులు రిజెక్ట్ అయ్యేవట. దీంతో ఆ విషయాలు కూడా అతడి భార్య రమానే చూసుకుంటుంది.

2016లో రాజమౌళి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మక బిరుదు పద్మశ్రీని పొందారు. అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు అందుకున్నారు.

కుటుంబ సభ్యులు రాజమౌళిని నంది అని పిలుస్తారు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ జక్కన్న అని పిలుస్తారు

ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2020 జూలై 30న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.