UKలో టాప్ 5 తెలుగు సినిమాలు లిస్ట్ : పుష్ప 2 నెంబర్ వన్!
తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. యూకే బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాల జాబితాలో పుష్ప 2 అగ్రస్థానంలో ఉంది.

Pushpa2, baahubali, prabhas, Tollywood, boxoffice
తెలుగు సినిమా ఎల్లలు దాటి పరుగలు తీస్తోంది. ప్యాన్ ఇండియా మోడల్ లో సినిమాలు తీయటం మొదలెట్టాక మొత్తం మారిపోయింది. ప్రపంచ వ్యాప్త బిజినెస్ లు లెక్కలు వేస్తున్నారు. అలాగే మన సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి.
ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ క్రమంలో యూకే భాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే
యూకే బాక్సాఫీస్ టాప్ 10 తెలుగు సినిమాలు (వసూళ్లు పౌండ్లలో):
Allu Arjun, #Pushpa2, sukumar
1. పుష్ప 2 - £1.90 మిలియన్ (46 రోజులు)
పుష్ప – 2 : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వేట కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ హవా ఆపు లేకుండా కొనసాగుతూనే ఉంది. హిందీలో రూ. 800 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేవలం 25 రోజుల్లో రూ. 264 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. యూకే లో ఎక్కువ కలెక్ట్ చేసిన లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
Allu Arjun, #Pushpa2, sukumar
2. బాహుబలి 2 - £1.82 మిలియన్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి2’ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. 2017 ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల అయ్యిన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది.దేశ విదేశాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే.. అది ఈ సినిమా వల్లనే అని చెప్పాలి. ఇక ఈ చిత్రం విడుదలయ్యి యుకే లో £1.82 మిలియన్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
Allu Arjun, #Pushpa2, sukumar
3. కల్కి 2898AD - £1.55 మిలియన్
కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 1200 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో రూ. 275 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. అందుకు తగినట్లే ఆయన ఎంచుకునే కథలు ఉంటున్నాయి.
ఇక ‘మహానటి’ తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ్ అశ్విన్. వీరిద్దరి (Prabhas and Nag Ashwin) కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే ఓ పాన్ వరల్డ్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని పురాణాలను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
4. ఆర్ఆర్ఆర్ - £1.03 మిలియన్
ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఈ ప్యాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Allu Arjun, #Pushpa2, Sukumar
5. సలార్ - £620K
700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సలార్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల ర్యాంకింగ్ లో ఐదవ స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ప్రభాస్, శ్రతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సలార్ మూవీ రూ. 270 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
Junior NTRs Devara Two film update out
6. దేవర - £550K
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా చిత్రంగా సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే దేవర, వరగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించడంతో సినిమాకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా ఈ చిత్రానికి దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. దీంతో 'దేవర' ఎన్టీఆర్ హిట్ ఖాతాలో చేరింది.
7. ఆదిపురుష్ - £395K
8. హనుమాన్ - £321K
9. బాహుబలి - £311K
10. సాహో - £29
సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ (Hanuman) బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెద్దగా ఎవరూ పట్టించు కోని స్థితిలో రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా... మూడో రోజు నుంచి థియేటర్స్ కౌంట్ పెంచుకోని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుసింది.