30 ఏళ్ళు పెద్ద.. ముఖ్యమంత్రిని రెండో పెళ్లి చేసుకున్న తెలుగు యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఆమె టాలీవుడ్ హీరోయిన్, యంగ్ హీరోయిన్.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది.. రహస్య వివాహం చేసుకుంది. కాని ఆమె ఎవరిని పెళ్లాడిందో తెలిస్తే.. షాక్ అవుతారు.. తన కంటే 30 ఏళ్లు పెద్ద అయిన ముఖ్యమంత్రిని పెళ్ళి చేసుకుంది యంగ్ హీరోయిన్ ఇంతకీ ఎవరా హీరోయిన్..?
ప్రముఖ నటి, కన్నడ, తెలుగు హీరోయిన్ రాధిక గుర్తుందా.. ఇలా చెపితే గుర్తుకు రాదు కాని.. తారక రత్నతో భద్రాద్రి రాముడు సినిమా చేసిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకు వస్తుంది. ఆమె రాధిక. కన్నడ హీరోయిన్ టాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాలు చేసింది. కాని కెరీర్ లో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయింది. కాని ఆమె తీసుకున్న ఓ నిర్ణయం తన జీవితాన్ని మార్చడంతో పాటు.. కర్నాటక రాజకీయాలను కూడా ప్రభావితం చేసింది.
radhika kumaraswamy
హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించింది రాధిక. రాజకీయంగా కూడా ప్రకపనలు సృష్టించింది. ఆమె ప్రేమలో నిండా మునిగిన కుమార స్వామి.. రాధికను రహస్య వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి 2006 లోనే జరిగింది.
కాని వీరి రహస్య వివాహం 2010 లో బయటపడింది. తాను గతంలోనే జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిని పెళ్లాడినట్లు 2010లోనే రాధిక స్వయంగా వెల్లడించింది. అంతే కాదు వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది.
కన్నడ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి టైమ్ వరకూ.. హెచ్‌డి కుమారస్వామి వయస్సు 47 కాగా, రాధిక అతని కంటే 27 సంవత్సరాలు చిన్నది. కాగా కుమారస్వామికి ఇది రెండో వివాహం. అతని మొదటి వివాహం 1986 సంవత్సరంలో జరిగింది. నివేదికల ప్రకారం, ఇది రాధికకు రెండవ వివాహం కూడా. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, అయితే ఈ వివాహం త్వరలోనే విడిపోయింది.
ఇక రాధిక మూవీ కెరీర్ గురించి చూస్తే.. 2002లో కన్నడ చిత్రం నీలా మేఘా శామ తో ఆమెకు పాపులారిటీ వచ్చింది. కాని ఆమె తేరంగేట్రం చేసిన సినిమా మాత్రం కన్నడలో వచ్చిన ‘నీనాగాగి’. రాధిక మొదటి సినిమా టైమ్ కు చాలా చిన్న పిల్ల. స్కూల్ ఏజ్ లోనే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ టైమ్ లో 9వ తరగతి చదువుతున్న రాధిక వయస్సు.. 14 సంవత్సరాలు మాత్రమే.
కాని ఆమె తన సినిమా కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేదు. 30 సినిమాలకే ఆమె కెరీర్ ఆగిపోయింది. హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా.. ఇండస్ట్రీని వదులుకోలేక నిర్మాతగా మారింది. సినిమాలు నిర్మించడం ప్రారంభించింది. ఇక టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది రాధిక. తారకరత్న హీరోగా వచ్చిన భద్రాద్రి రాముడులో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకుడిగా అవతారం సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.
మరో విషయం ఏంటంటేు.. కుమారస్వామికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయడం రాధిక తండ్రికి ఇష్టం లేదట. తన వయస్సు ఉన్న వ్యక్తితో కూతురు ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆయన మదనపడ్డాడట. దాంతో బయటకు వచ్చి గందర్వ వివాహం చేసుకుంది రాధిక. వారిద్దరూ తమ వివాహాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఆతరువాత విషయం తెలిసి తండ్రి కూడా షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.
Radhika Kumaraswamy
ఇక ప్రస్తుతం 36 ఏళ్ల రాధిక హీరోయిన్ గా పూర్తిగా ప్లాప్ అయ్యింది. కాని ఆమె తెలివితో బిజినెస్ విమెన్ గా సక్సెస్ సాధించింది. కర్నాటక సీఎంను పెళ్లాడిన తర్వాత కోట్లాది రూపాయలు ఆమె కూడబెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం రాధిక పేరుమీద 130 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.