నయనతార - విఘ్నేశ్ శివన్ మ్యారేజ్ డేట్ ఇదే.. పెళ్లి ఎక్కడంటే?
స్టార్ హీరోయిన్ నయనతార - దర్శకుడు విఘ్నేశ్ శివన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం వెడ్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా వీరి వివాహా తేదీ, వేదికకు సంబంధించిన అప్డేట్ అందింది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రియమైన జంటగా విఘ్నేష్ శివన్ మరియు నయనతార ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక ఈ జంట పెళ్లిపీటలు ఎక్కే సమయం వచ్చేసింది. ఇందుకు సంబంధించిన అప్డేట్ తాజాగా అందింది.
గతేడాది బంధుమిత్రలు, సన్నిహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎప్పుడెప్పుడూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరికొందరు అప్పటికే వీరిద్దరూ రహస్యంగానే పెళ్లి కూడా చేసుకున్నారనే టాక్ కూడా నడిచింది. కానీ తాజా సమాచారంతో వీరి వివాహం ముందే ఉందని స్పష్టం అయ్యింది.
పూల అలంకారాలు, నీలి ఆకాశంతో కూడిన సుందరమైన కుటీరంతో ఈ ప్రేమ జంట ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గతంలోనే ఇన్విటేషన్ కార్డును వీరు సందర్శించిన పలు దేవాలయాల్లో స్వామివారి పాదాల వద్ద ఉంచి, ప్రత్యేక పూజాలు కూడా చేయించారు.
అయితే, ఈ ఇన్విటేషన్ కార్డులో తాజాగా వీరి వివాహా వేడుక తేదీ, స్థలం కు సంబంధించిన వివరాలను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ‘నయన్ మరియు విక్క్ వివాహా తేదీని గుర్తుంచుకోండి. జూన్ 9, 2022న ఘనంగా వెడ్డింగ్ జరగనుంది.’ అనే సమాచారంతో కార్డు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.
వచ్చే నెల జూన్ 9న నయనతార మరియు విఘ్నేష్ శివన్ వివాహాం తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్ లో ఘనంగా జరగనుంది. ఈ వివాహా వేడుకకు దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఘట్టంతో నయనతారా, విఘ్నేశ్ శివన్ కొత్త జీవితం ప్రారంభం కానుంది.
ఎట్టకేళలకు నయనతార, విఘ్నేశ్ శివన్ తో వివాహానికి రెడీ అవుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు ముందస్తుగా అడ్వాన్డ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విషెస్ తెలుపుతున్నారు. నయనతార ఇటీవవల తమిళ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో ‘గాడ్ ఫాదర్’లోనూ నటిస్తోంది.