MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ' భగవంత్ కేసరి' రీమేక్ రైట్స్ కొన్నారు కానీ చేయటం లేదు,కేవలం అదొక్కటే తీసుకుంటారు

' భగవంత్ కేసరి' రీమేక్ రైట్స్ కొన్నారు కానీ చేయటం లేదు,కేవలం అదొక్కటే తీసుకుంటారు

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాను విజయ్ రీమేక్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో, అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం. విజయ్ 'దళపతి 69' సినిమాలో కొన్ని పాత్రలు భగవంత్ కేసరిని పోలి ఉన్నందున, కాపీరైట్ సమస్యలు రాకుండా రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 20 2024, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Thalapathy Vijay, Bhagavanth Kesari, Remake

Thalapathy Vijay, Bhagavanth Kesari, Remake


గాడ్ అఫ్ మాసెస్ గా అభిమానులు చెప్పుకునే నందమూరి బాలకృష్ణ దర్శకుడి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అనిల్ రావిపూడి తన కామెడీ జానర్ ను పక్కన పెట్టి మొదటిసారి సరికొత్త కథ, కాదనాలతో బాలయ్యను సెటిల్డ్ గా ప్రెసెంట్ చేసాడు. డాన్సింగ్ క్వీన్  శ్రీలీల బాలయ్య కూతురుగా నటించింది. రీసెంట్ గా 2024 ఉత్తమ చిత్రంగా సైమా, ఐఫా అవార్డులు సైతం గెలుచుకుంది. ఈ సినిమాని తమిళ హీరో విజయ్ రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేని తమిళ మీడియా చెప్పుకొచ్చింది. ఈ నేపధ్యంలో అసలు నిజం ఏమిటనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘ది గోట్’ సినిమాతో యావరేజ్ దక్కింది. తెలుగులో అయితే డిజాస్టర్ అయ్యింది. తమిళ  బాక్సాఫీస్ వద్ద టాక్ కు సంభందం లేకుండా భారీ వసూళ్లే వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో  ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దీంతో చివరి సినిమాగా అంటూ చేస్తున్న తాజా చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్.  

36


ఇప్పుడు ‘దళపతి 69’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయ్యారు.

అలాగే మలయాళ నటి మమతా బైజు,పూజ హెగ్డే కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.  కాగా దళపతి విజయ్ ఆఖరి సినిమా  తెలుగు సినిమా‘భగవంత్ కేసరి’కు రీమేక్ అని వార్తలు మొదలయ్యాయి  ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉండటంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. అయితే అసలు నిజం వేరే ఉందిట.
 

46
Thalapathy Vijay

Thalapathy Vijay


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు విజయ్ నిజంగానే రీమేక్ రైట్స్ కొన్నాడు కానీ అఫీషియల్ గా రీమేక్ చేయడం లేదు. కొన్ని పాత్రలు ఒరిజినల్‌కు సిమిలర్ గా అనిపించాయి కాబట్టి మేకర్స్ ఎలాంటి సమస్యలు రాకుండా  రైట్స్ కొనుగోలు చేసారు. ‘దళపతి 69’  సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజ, విజయ్ ల రిలేషన్ ఓ గార్డియన్ కు, ఓ నడివయస్సు వ్యక్తికి మధ్య ఉంటుంది.   'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ,  శ్రీలీల మధ్య ఉండే రిలేషన్ కూడా ఇలాంటిదే. రేపు కాపీ రైట్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.  కేవలం ఆ ఒక్క విషయంలోనే పోలిక కానీ మిగతా  కథ , స్క్రీన్‌ప్లే మొత్తం వేరేగా ఉండబోతోందిట.

56
Thalapathy vijay

Thalapathy vijay


పూజ హెగ్డే పాత్ర కూడా తెలుగులో కాజల్ అగర్వాల్ ని పోలి ఉండదట. వీళ్లిద్దరి మధ్యా మంచి ఫన్, లవ్ ట్రాక్, పాటలు ఉంటాయి. తెలుగులో మిస్సైన ఎలిమెంట్స్ ఇక్కడ రికవరీ చేస్తారు. రొమాన్స్ ,యాక్షన్ తో కూడిన స్ట్రైయిట్ సబ్జెక్టు ఇది అని తెలుస్తోంది. తెలుగు సినిమాని రీమేక్ చేస్తే తెలుగులో విజయ్ మార్కెట్ కు పెద్ద దెబ్బ కాబట్టే ఇలాంటివి చేయదలచుకోలేదని చెప్తున్నారు.  

66
thalapathy vijay

thalapathy vijay

భగవంత్ కేసరిలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ బాగా ఎక్కింది.  ‘దళపతి 69’ తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇప్పటికే పార్టీని ప్రకటించడం విశేషం. అందుకే ఆయన ఆఖరి సినిమాలో సైడ్ ట్రాక్ లో  రాజకీయాలను టచ్ చేసేలా కథ ఉంటుందని అంటున్నారు. సినిమా టైటిల్ రివీల్ అయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved