UI vs విడుదల 2: తెలుగు బాక్సాఫీస్ దగ్గర గెలుపు దేనిది?
ఉపేంద్ర ద డైరక్ట్ చేసిన యుఐ, విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను ఎదుర్కొన్నాయి. యుఐ కర్ణాటకలో మంచి ఓపెనింగ్స్ సాధించగా, విడుదల 2 తమిళనాడులో మంచి టాక్ తెచ్చుకుంది. రెండు సినిమాలు తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాయి.
Vidudhala 2, UI, Telugu box office
ఈ వారం కన్నడ సెన్సేషనల్ యాక్టర్ డైరెక్టర్ ఉపేంద్ర(Upendra) చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ(UI Movie), అలాగే తమిళ దర్శకుడు వెట్రిమారన్ డైరక్ట్ చేసిన విడుదల 2 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు తెలుగులో భారీ ప్రమోషన్స్ చేసారు. అయితే ఈ సినిమాలు రెండింటింకి సరైన టాక్ రాలేదు. టాక్ ప్రక్కన పెడితే కలెక్షన్స్ బాగా తక్కువగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు మిక్సెడ్ టాక్ రన్ అవుతోంది. ఈ సినిమాల కి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్, మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి అసలు బాగోలేదనే రెస్పాన్స్ ను రావటం విశేషం.
అయితే ఈ రెండు సినిమాలకు తమ తమ రాష్ట్రాల్లో మంచి ఓపినింగ్స్ వచ్చాయి. యుఐ మూవీ(UI Movie) ఓపెనింగ్స్ పరంగా సినిమా కర్ణాటకలో మాత్రం ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ ఇయర్ కన్నడ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేస్తూ ఏకంగా 7.3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలలో యుఐ మూవీ(UI Movie) గ్రాస్ 70 లక్షల రేంజ్ లో ఉండగా ఫైనల్ గా మొదటి రోజు 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇక్కడ సినిమా యావరేజ్ అనిపించుకోవాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుందని తేల్చింది ట్రేడ్.
సినిమా రెండో రోజు కర్ణాటకలో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా తెలుగు లో ఎక్కడా చెప్పుకోదగిన కలెక్షన్స్ కనపడటం లేదు. కానీ ఇక్కడ కొంచం డివైడ్ టాక్ ఎక్కువగా ఉండటంతో సినిమా తేరుకుని స్ట్రాంగ్ కలెక్షన్స్ ని వీకెండ్ లో సాధిస్తేనే ఒడ్డున పడుతుంది.
అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2(Vidudala Part 2) సినిమా తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకోగా తెలుగు లో మాత్రం మిక్సుడ్ టాక్ ను సినిమా సొంతం చేసుకుంది. ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే సినిమా…తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిలో పార్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.
మొత్తం మీద విడుదల పార్ట్ 2 చిత్రం 35 లక్షల గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు ఓవరాల్ గా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. మొదటి రోజు షేర్ 22 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా. సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వీకెండ్ లో సాలిడ్ జోరు చూపిస్తేనే ఒడ్డున పడుతుంది.