MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • 2024లో డబుల్ డిజాస్టర్స్ అందుకున్న తెలుగు హీరోలు వీళ్లే

2024లో డబుల్ డిజాస్టర్స్ అందుకున్న తెలుగు హీరోలు వీళ్లే

2024లో వరుసగా రెండు డిజాస్టర్ సినిమాలు అందుకున్న టాలీవుడ్ హీరోల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. రవితేజ, గోపిచంద్, వరుణ్ తేజ్, విశ్వక్సేన్, శ్రీ విష్ణు, అల్లరి నరేష్ వంటి హీరోలు వరుసగా రెండు సినిమాలతో పరాజయం చవిచూశారు.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 31 2024, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ravi teja, Gopichand, varunteja, sri vishnu

Ravi teja, Gopichand, varunteja, sri vishnu


2024 వ సంవత్సరం మరికొద్ది గంటల్లో వెళ్లిపోతోంది. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లస్ లు మైనస్ లు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం తెలుగు పరిశ్రమ వెలుగు జిలుగులు సైతం ఇండస్ట్రీ లెక్కలేస్తోంది.
 

ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా వెలుగుతున్న తీరు, ప్యాన్ ఇండియా సినిమాల జోరుతో పాటు ఈ యేడ్ డబుల్ డిజాస్టర్స్ ఇచ్చిన హీరోలను ఇండస్ట్రీ ఆసక్తిగా గుర్తు చేసుకుంటోంది. ఆ హీరోలు ఎవరో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


రవితేజ

గత కొద్ది సంవత్సరాలుగా రవితేజ కెరీర్ పరంగా ఛాలెంజ్ ని ఎదుర్కొంటున్నారు.  ఒక్క హిట్ వస్తే నాలుగు ప్లాఫ్ లు అన్న ధోరణి నడుస్తోంది. ఈ క్రమంలో 2024లోనూ రెండు పెద్ద సినిమాలు చేసాడు రవితేజ. అవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి. ఆ సినిమాలు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ . ఈ రెండు సినిమాలు మినిమం రికవరీ కూడా భాక్సాఫీస్ దగ్గర సాధించలేక చతికలపడ్డాయి.

37


గోపిచంద్

ఇక ఎంతో కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఎవరూ అంటే గోపిచంద్ అని చెప్పాలి. సరైన సక్సెస్ దొరక్క అల్లాడిపోతున్న గోపీచంద్ ఓ పూర్తి యాక్షన్ చిత్రం, మరో యాక్షన్ కామెడీ చిత్రం చేసారు. కన్నడ దర్శకుడుతో రూపొందించిన డివోషనల్ యాక్షన్ చిత్రం భీమ భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అలాగే తన కెరీర్ లో ఎన్నో కామెడీ సినిమాలు అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన విశ్వం సైతం వర్కవుట్ కాలేదు. ఇద్దరు దర్శకులు కలిసి గోపిచంద్ ని మరోసారి ఫ్లాఫ్ ల ఊబిలోకి తోసేసారు.
 

47


వరుణ్ తేజ్

మెగా వారసుడు వరుణ్ తేజ్ సక్సెస్ చూసి చాలా ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో 2024లో రెండు ప్యాన్ ఇండియా భారి బడ్జెట్ సినిమాలతో మన ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు భాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందులో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్, మట్కా చిత్రం. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం మొదటి నుంచి తేడా అనిపించింది. కానీ మట్కా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 70 కోట్లుతో తీసిన ఈ చిత్రం 10 కోట్లు కూడా రికవరీ చేయలేకపోయింది. 
 

57


విశ్వక్సేన్
 
ఇక ఈ 2024 యంగ్ హీరో విశ్వక్సేన్ కు కూడా కలిసి రాలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో గామి సినిమాతో పలకరించాడు. ఈ సినిమాకు రివ్యూలు బాగానే వచ్చినా ఈ చిత్రం భాక్సాఫీస్ పరంగా డిజాస్టర్ అయ్యింమది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ చిత్రాలు చేస్తే ఆ రెండు సినిమాలు కూడా అసలు ఆడలేదు. కమర్షియల్ గా ఈ మూడు సినిమాలు నిర్మాతలు నష్టం కలిగించాయి.

67


శ్రీ విష్ణు

హీరోగా శ్రీవిష్ణుకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. అతని సినిమాకు మినిమం గ్యారెంటి అని లాస్ట్ ఇయర్ వచ్చిన సామజవరగమన ప్రూవ్ చేసింది. అయితే 2024 అతనికి కలిసి రాలేదు. ఈ సంవత్సరం చేసిన ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలు రెండు భాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. ఓపినింగ్స్ పరంగా బాగానే తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు అతన్ని కెరీర్ పరంగా వెనక్కి తోసేసాయి.

77


అల్లరి నరేష్

కామెడీ సినిమాలు వదిలేసి సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ కు 2024 కలిసి రాలేదు. తన పాత పంధాలోకి వెళ్లి చేసిన కామెడీ సినిమా ఆ ఒక్కటీ అడక్కు సినిమా, సీరియస్ ఫిల్మ్ బచ్చల మల్లి ఈ రెండు సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నమోదు అయ్యాయి. కొత్త సంవత్సరంలో అయినా నరేష్ తిరిగి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Pre Match
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
IND chose to bowl.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved