- Home
- Entertainment
- Entertainment News
- సురేఖ వాణి, ప్రగతి, పవిత్ర.. హీరోయిన్లకు పోటీ ఇస్తున్న అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు
సురేఖ వాణి, ప్రగతి, పవిత్ర.. హీరోయిన్లకు పోటీ ఇస్తున్న అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు
అవ్వడానికి వారు క్యారెక్టర్ఆర్టిస్ట్ లే కాని.. అందంలో మాత్రం స్టార్ హీరోయిన్లకుఏమాత్రం తక్కువ కాదు.. సంపాదనలో కూడా వారికి పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్న ఆంటీస్ ఎవరో చూద్దాం.

ఒకప్పటి హీరోయిన్లు.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తుండటం తెలిసిందే. అందం అభినయంలో ఏమాత్రం తీసిపోకుండా దూసుకు పోతుంటారు. కాని రావడమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా వచ్చి.. ఏజ్ బార్ అవుతున్నా హీరోయిన్లను మించిన అందంతో.. అభియనయంతో హడావిడి చేస్తేన్న తారు చాలామంది ఉన్నారు. వారి బ్యూటీ ముందు యంగ్ హీరోయిన్స్ కూడా చిన్నబోక తప్పదేమో..?
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో గ్లామర్ క్వీన్ అంటే ముందుగా గుర్తకు వచ్చేది సురేఖ వాణి పేరు మాత్రమే. ఈమె కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు తల్లి పాత్రలు కూడా చేస్తుంది. కాని సురేఖ వాణి ఏ పాత్రలు చేసినా.. ఆమె గ్లామర్ విషయంలో మాత్రం హీరోయిన్లను మించి చూపిస్తుంటుంది. సోషల్ మీడియా లో ఆమె చేసే ఎక్స్ పోజింగ్ అంతా ఇంత కాదు. కూతురుతో కలిసి అదరిపోయే రీల్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ. సినిమాల్లో సాంప్రదాయంగా కనిపించే సురేఖ.. బయట మాత్రం హాట్ ఫోటో ఫోటో షూట్ లు చేస్తూ షాక్ ఇస్తుంది.
ఇక క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. హాట్ గా కనిపించేవారిలో ప్రగతి కూడా ఒకరు. ప్రగతి మొదటి నుంచి తల్లిపాత్రలే ఎక్కువగా చేసింది. కాని బయట మాత్రం ఆమె యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తూ.. దూసుకుపోతుంటుంది. మరీ ముఖ్యంగా ప్రగతి జిమ్ వీడియోస్ కు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమధ్య వెయిట్ లిప్టింగ్ లో ఛాంపియన్ గా కూడా నిలిచింది ప్రగతి. హాట్ హాట్ డాన్స్ లు .. అదరిపోయే అందాలు ఆరబోస్తూ.. ఆడియన్స్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది ప్రగతి. సినిమాల్లో మాత్రం చాలా సెన్సిటివ్ పాత్రలు చేస్తుంటుంది.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హాట్ గా కనిపించేవారిలో పవిత్ర లోకేష్ గురించి చెప్పుకోవాలి. ఈమె గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా నటించి.. అప్పట్లోనే స్కిన్ షోకు తెరలేపిన పవిత్ర.. ప్రస్తుతం తల్లి పాత్రలతో అలరిస్తూ ఉంది. 50కి దగ్గరలో ఉన్న పవిత్ర లోకేష్.. అందం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు. తాజాగా టాలీవుడ్ నటుడు నరేష్ తో లివింగ్ రిలేషన్ లోఉంది. త్వరలో నరేష్ నురెండో పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రియ గురించి చాలామందికి తెలియదు. అందానికిఅందం.. అభినయానికి అభినయం చూపించే ఈ బ్యూటీ.. మొదటి నుంచి క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చింది. హీరోయిన్ ను మించిన అందం ఉన్నా.. కెరీర్ బిగినింగ్ నుంచి చెల్లెలు పాత్రలకే పరిమితం అయ్యింది ప్రియ. స్టార్ హీరోలకు చెల్లిగా నటించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం యంగ్ హీరోయిన్లకుతల్లిగా నటిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.హాట్ హాట్ గా కనిపిస్తూ..అలరిస్తుంటుంది.
ఇక హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా తయారయ్యింది గుప్పెడంత మనసు ఫేమ్ జగతీమేడమ్.. అలియాస్ జ్యోతీరాయ్. ఈమె కన్నడ సినిమాల్లో నటిస్తోంది. అయితె తెలుగు ప్రేక్షకులకు గుప్పెడంత మనసు సీరియల్ లో రుషికి తల్లిగా తెలుసు. ఈసీరియల్ లో నిండుగా చీర కట్టుకుని..పెద్ద బొట్టుపెట్టుకుని..తల్లి అంటే ఇలానే ఉండాలి అన్నట్టు కనిపిస్తుంటుంది. కాని సోషల్ మీడియాలో జ్యోతీరాయ్ చేసే హాట్ షో అంతా ఇంతా కాదు. కుర్రాళ్లకు కాకపుట్టిస్తూ.. చంపేస్తోంది. ఇలా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఏజ్ బార్ అయినా కూడా.. హాట్ హాట్ గా అదరగొడుతున్నారు.