MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • సూపర్ హిట్ ‘స్త్రీ 2’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

సూపర్ హిట్ ‘స్త్రీ 2’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

అత్యధిక వసూళ్లు రాబట్టిన 11వ భారతీయ సినిమాగా నిలిచింది. ఆ స్దాయి ఘన విజయం సాధించిన చిత్రాన్ని ఓటిటిలో చూద్దామనుకునే వాళ్లకు ఇది శుభవార్తే. ఈ సినిమా ఓటిటి డేట్ ఫిక్సైంది.

2 Min read
Author : Surya Prakash
| Updated : Sep 10 2024, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


బాలీవుడ్‌ లో ఈ మధ్యకాలంలో సెన్సేషన్ గా నిలిచిన చిత్రం  ‘స్త్రీ 2’. శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్‌ రావు (Rajkummar Rao) జంటగా నటించిన రీసెంట్‌ మూవీ ‘స్త్రీ 2’ (Stree 2). కామెడీ హారర్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్‌ కౌశిక్ దర్శకత్వం వహించారు.

ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్టై , అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే రూ.400 కోట్లు వసూలుచేసి.. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్‌ మూవీగా నిలిచింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఆగస్టు 15న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ హారర్‌ కామెడీ మూవీ ఇప్పటి వరకూ రూ. 750 కోట్లకు (గ్రాస్‌)పైగా వసూళ్లు చేసింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన రెండో భారతీయ చిత్రమిది. మరోవైపు, అత్యధిక వసూళ్లు రాబట్టిన 11వ భారతీయ సినిమాగా నిలిచింది. ఆ స్దాయి ఘన విజయం సాధించిన చిత్రాన్ని ఓటిటిలో చూద్దామనుకునే వాళ్లకు ఇది శుభవార్తే. ఈ సినిమా ఓటిటి డేట్ ఫిక్సైంది.

 

36


బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం  సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. స్త్రీ 2 చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్మెంట్ రానున్నట్లు సమాచారం.

స్త్రీ 2 సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే భయపెడుతుంది కాబట్టి ఓటిటిలలోనూ బాగానే ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు. 
 

46


చిత్రం కథేంటి

స్త్రీ’కి సీక్వెల్ గా  తెరకెక్కిన చిత్రమే ‘స్త్రీ 2’. పార్ట్‌-1లో నటించిన నటీనటులతోనే దర్శకుడు అమర్‌ కౌశిక్‌ దీనిని రూపొందించారు. చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకునేలోగా ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. గ్రామంలో మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట.

ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (అపర్ శక్తి )తోపాటు శ్రద్ధా కపూర్ ఎలా ఎదుర్కొంటారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2).
 

56


‘స్త్రీ 2’ విడుదలయ్యాక.. మూవీ మేకింగ్ గురించి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ‘స్త్రీ’ మాదిరిగానే ‘స్త్రీ 2’ కూడా మంచి ఫన్‌ అందించిందని మూవీ లవర్స్‌ అభిప్రాయపడ్డారు. శ్రద్ధాకపూర్‌ - రాజ్‌కుమార్‌రావు జోడీ మరోసారి హిట్‌ అయ్యిందని కామెంట్స్ చేశారు. ఆగస్టు 15న విడుదలైన పలు స్టార్‌ హీరోల చిత్రాలు ‘వేదా’ (జాన్‌ అబ్రహం), ఖేల్‌ ఖేల్‌ మే (అక్షయ్‌కుమార్‌)కు  ఇది గట్టి పోటీ ఇచ్చింది. 

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

66


 బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోలు షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ చిత్రాలు ఈ రికార్డును ఇంత తక్కువ రోజుల్లో అందుకోలేకపోయాయని పలువురి అంచనా. తాజా రికార్డుతో శ్రద్ధాకపూర్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలవడం విశేషం.

దీనికంటే ముందు సుమారు రూ.400 కోట్లతోనే ‘సాహో’ ఆ జాబితా మొదటి ప్లేస్‌లో ఉండేది. ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘కల్కి 2898 ఏడీ’ తొలి స్థానంలో ఉండగా.. ‘స్త్రీ 2’ రెండో స్థానాన్ని సొంతం చేసుకుందని అంచనా.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved