శ్రీవారి సేవలో 'సరిలేరు నీకెవ్వరు' టీమ్!

First Published 17, Jan 2020, 11:19 AM

మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన చిత్ర యూనిట్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనానికి తీర్థప్రసాదాలు అందించిన అధికారులు.
 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులతో పాటు సీనియర్ నటి విజయశాంతి తదితర 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఈ ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపింది.

మహేశ్ బాబు, నమ్రత, గౌతమ్, సితారలతో పాటు రాజేంద్రప్రసాద్, వంశీ పైడిపల్లి, దర్శకుడు అనిల్ రావిపూడి, ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు తదితరులు, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి వెళ్లారు.

గత వారం విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆలయానికి వచ్చిన సెలబ్రిటీలకు ప్రొటోకాల్ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, దర్శనం తరువాత వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.