- Home
- Entertainment
- Entertainment News
- థియేటర్ల ముందు సమంత భారీ కటౌట్స్.. స్టార్ హీరోయిన్లలో సమంతకే ఇలాంటి క్రేజ్.!
థియేటర్ల ముందు సమంత భారీ కటౌట్స్.. స్టార్ హీరోయిన్లలో సమంతకే ఇలాంటి క్రేజ్.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత ‘యశోద’తో తాజాగా స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు సైతం సమంత క్రేజ్ షాక్ ఇస్తుండటం విశేషం. ఈ రోజు Yashoda రిలీజ్ కావడంతో అంతటా సామ్ పేరే వినిపిస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పాలి. సౌత్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. చైతూతో విడిపోయిన తర్వాత తన కేరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది.
సమంత (Samantha) నటించిన సై-ఫై చిత్రం ‘యశోద’ ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నిన్నటి వరకు భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. రిలీజ్ తర్వాత కూడా ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అంచనాలను రీచ్ అయ్యింది. తొలిరోజు ఫస్ట్ షోతో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ నే కొనసాగించేలా కనిపిస్తోంది. అయితే, ‘యశోద’చిత్రంతో సమంత ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇంతవరకు సౌత్ హీరోయిన్లకు లేని క్రేజ్ ను ఈ స్టార్ హీరోయిన్ దక్కించుకుంది. ‘యశోద’తో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసుకుంటోంది. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.
‘యశోద’ చిత్రం రిలీజ్ సందర్భంగా సమంత అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. థియేటర్ల ముందు భారీ కటౌట్స్ ఏర్పాట్లు చేసి సమంతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కటౌట్లకు భారీ పూజమాలలు వేసి, యశోద రిలీజ్ ను వేడుకలాగా చేశారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని చోట్ల ‘యశోద’ రిలీజ్ సందర్బంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుండటం విశేషం.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద సినిమా సంబురాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, నంద్యాల, విజయనగరం ఏరియాల్లోని థియేటర్లలో భారీ కటౌట్స్ ను ఏర్పాటు చేశారు. సమంత ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సినిమాను విజయవంతం చేయాలని అభిమానులు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. స్టార్ హీరోలకు పోటీనిచ్చేలా సమంత క్రేజ్ సంపాదంచుకోవడం విశేషం. ఇలాంటి క్రేజ్ ను సమంత సొంతం చేసుకోవడం గొప్పవిషయమనే చెప్పాలి.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకెళ్తున్న సమంత అంతకంతకు తన క్రేజ్ పెంచుకుంటోంది. ‘యూటర్న్’, ‘ఓ బేబీ’ తర్వాత ఇప్పుడు ‘యశోద’తో మరో మైల్ స్టోన్ ను రీచ్ అయ్యింది. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ సమంత సక్సెస్ అవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ‘యశోద’ చిత్రాన్ని విజయవంతం చేస్తున్నారు.