- Home
- Entertainment
- Entertainment News
- Yashoda Release Date : సమంత ‘యశోద’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఖిల్ ‘ఏజెంట్’తో పోటీపడనున్న పుష్ప బ్యూటీ..
Yashoda Release Date : సమంత ‘యశోద’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఖిల్ ‘ఏజెంట్’తో పోటీపడనున్న పుష్ప బ్యూటీ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). ఈ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ‘యశోద’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి హరిశంకర్ మరియు హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యశోద అనే పాత్రలో నటిస్తోంది. అలాగే ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ పాన్ ఇండియన్ చిత్ర షూటింగ్ ను గతేడాది డిసెంబర్ లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఈ మూవీ చిత్రీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కొంత భాగం యాక్షన్స్ సీక్వెల్స్ ను కూడా చిత్రీకరించారు.
ఇందుకోసం మేకర్స్ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ (yannick ben)నే రంగంలో దించారు. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ ను కూడా పూర్తి చేసుకున్నారు. మే నెల చివరి వారంలో ఈ సినిమా పూర్తిగా షూటింగ్ పార్ట్ ముగియనుంది.
అయితే ఇప్పటికీ యశోద మూవీ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్ మాత్రం ఏమీ రాలేదనే చెప్పాలి. కేవలం షూటింగ్ సెట్ కు సంబంధించిన ఫొటోలతోనే ఇన్నాళ్లు అభిమానులు సరిపెట్టుకున్నారు. చివరిగా సమంత పుష్ప (Pushpa) సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి అలరించింది. అంతకు ముందు శర్వానంద్ తో కలిసి ‘జాను’ సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ నే పొందాయి. అయితే జాను చిత్రం రెండేండ్ల కింద రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తర్వాత సమంత పుష్ఫ సినిమాలో ఒక్క సాంగ్ తోనే సరిపెట్టింది.
దీంతో అభిమానులు సమంత అప్ కమింగ్ ఫిల్మ్స్ ‘శాకుంతలం’, ‘యశోద’పాన్ ఇండియన్ చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. శాకుంతలం చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సమంత యశోద చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే రెండేండ్ల నుంచి సమంత చిత్రాలకు సంబంధించి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిజస్పాయింట్ అవుతున్నారు.
ఇది గమనించిన యశోద మూవీ మేకర్స్ అభిమానులను గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 12న ‘యశోద’ను పక్కాగా రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున అక్కినేని అఖిల్ (Akkineni Akhil) తాజా చిత్రం Agent కూడా రిలీజ్ కానుంది. దీంతో సమంత, అఖిల్ మధ్య పోటీ ఉండనుందని నెటిజన్లు అంటున్నారు.