- Home
- Entertainment
- Entertainment News
- గోల్డ్ పట్టు శారీలో మైమరిపిస్తున్న సమంత.. స్టార్ హీరోయిన్ ట్రెడిషనల్ లుక్ అదుర్స్..
గోల్డ్ పట్టు శారీలో మైమరిపిస్తున్న సమంత.. స్టార్ హీరోయిన్ ట్రెడిషనల్ లుక్ అదుర్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) న్యూ లుక్ అదిరిపోయింది. ట్రెడిషనల్ వేర్ లో చూపరులను ఆకట్టుకుంటోంది. పట్టుచీరలో గ్లామర్ బ్యూటీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దక్షిణ భారత ప్రముఖ నటీమణులలో ఒకరైన సమంత రూత్ ప్రభు, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పూర్తిగా హాట్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్ లో సమంత ఇంటర్నెట్‌లో తుఫాను తెప్పించింది. దివా తన దేశీ డిజైన్ లుక్ లో అద్భుతంగా కనిపించింది..
ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉండే స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మతిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. ‘రా మ్యాంగో’ చారల చీరలో స్లీవ్‌లెస్ మ్యాచింగ్ పసుపు బ్లౌజ్‌తో ఆకట్టుకుంది. ఈ ట్రెడిషనల్ లుక్ లో సమంత మరింతగా ఆకట్టుకుంది.
సమంత ధరించిన చీర ధర రూ. 32,800గా ఉంది. ఇంత విలువైన డిజైనర్ చీరను ధరించడంతో పాటు.. హోప్ చెవిపోగులలో తన ఇన్నర్ బాస్ లేడీని ఛానలైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ పిక్స్ లో సమంత స్మోకీ మంచు కళ్ళు, అట్రాక్టివ్ పెదవులు మరియు నిండిన కనుబొమ్మలతో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన దుస్తులు ధరించి, సౌకర్యవంతమైన సెట్టీపై బాస్ లేడీ లుక్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అయితే ఈ పిక్స్ ను షేర్ చేస్తూ ‘సేవ్ ఫర్ సాయిల్’కోసం అంటూ క్యాప్షన్ లో తెలిపింది. సద్గురు పిలుపు మేరకు సురక్షిత మట్టి కోసం ఇలా ప్రమోట్ చేస్తోంది. గతంలోని సమంత ఫ్లడ్స్ బాధితులకు, పలువురు రోగులకు సాయం చేసింది. అలాగే తెలంగాణ హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గానూ ఎంపికైంది.
ప్రస్తుతం సమంత తెలుగు వరుస చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తను నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలోనూ నటిస్తోంది. త్వరలో బాలీవుడ్, హాలీవుడ్ కూ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది.